Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నంది అవార్డ్స్ అత్యంత ప్రాముఖ్యత కలిగినవి. ఈ నంది అవార్డ్స్ విభాగంలో బెస్ట్ యాక్టర్స్ అనే కేటగిరీని 1977 లో ప్రవేశపెట్టగా….అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 40 ఏళ్లుగా ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు. 2017 తర్వాత నుండి ఈ అవార్డ్ పెడింగ్ లో పెట్టారు.!
- 1997 లో మొట్టమొదటి సారి బెస్ట్ యాక్టర్ అవార్డ్ ను రెబల్ స్టార్ కృష్ణంరాజు అమరదీపం సినిమాకు గానూ గెలుచుకున్నారు
- 2016 లో చివరి సారిగా ఈ అవార్డ్ ను నాన్నకు ప్రేమతో సినిమాకి జూనియర్ ఎన్టీఆర్ కు దక్కింది.
నంది అవార్డ్స్ అందుకున్న హీరోలు… వారి సినిమాలు:
ఇప్పటివరకు ఎక్కువ సార్లు బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డ్స్ అందుకున్న హీరో విక్టరీ వెంకటేష్ . ఆయనకు అవార్డ్ ను సాధించిపెట్టిన సినిమాలు ప్రేమ , ధర్మచక్రం , గణేష్ , కలిసుందాం రా , ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే.
Advertisements
మహేష్ బాబు నాలుగు సార్లు బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ అందుకున్నాడు.! నిజం , అతడు , దూకుడు , శ్రీమంతుడు సినిమాలకు గాను ఈ నంది అవార్డులు లభించాయి.
చిరంజీవి (3 సార్లు )- సినిమాలు : స్వయం కృషి , ఆపద్భాంధవుడు , ఇంద్ర
- బాలక్రిష్ణ (3 సార్లు )- సినిమాలు : నరసింహ నాయుడు , సింహ , లెజెండ్
Advertisement
- నాగార్జున (3 సార్లు )- సినిమాలు : అన్నమయ్య , సంతోషం , శ్రీరామ దాసు
- కమల్ హాసన్ (3 సార్లు )- సినిమాలు : సాగర సంగమం , స్వాతిముత్యం , ఇంద్రుడు చంద్రుడు
- జగపతి బాబు (3 సార్లు )- సినిమాలు : గాయం , మామి చిగురు , మనోహరం
- అక్కినేని నాగేశ్వరరావు (2 సార్లు )- సినిమాలు : మేఘసందేశం , బంగారు కుటుంబం
- కృష్ణంరాజు (2 సార్లు )- సినిమాలు : అమర దీపం , బొబ్బిలి బ్రాహ్మన్న
- దాసరి నారాయణ రావు (2 సార్లు )- సినిమాలు : మామ గారు , మేస్త్రీ
- రాజేంద్రప్రసాద్ (2 సార్లు )- సినిమాలు : ఎర్రమందారం , ఆ నలుగురు
Advertisements
- జూనియర్ ఎన్టీఆర్ కు నాన్నకు ప్రేమతో , ప్రభాస్ కు మిర్చి , సుమన్ కు బావ బావమర్ధి , రవితేజ కు నేనింతే , నాని కు ఏటో వెళ్ళిపోయింది మనసు సినిమాల్లోని నటనకు గాను ఒక్కోసారి నంది అవార్డ్ లు లభించాయి