Advertisement
హీరో నానిని చూస్తే అచ్చం మన పక్కింటి కుర్రాడిలానే అనిపిస్తుంటాడు..అష్టా చెమ్మా తో పరిచయం అయి వరుస హిట్స్ తో నేచురల్ స్టార్ ట్యాగ్ కూడా కొట్టేసాడు.. ముఖ్యంగా తన స్మైల్ .. బుగ్గన చేయి పెట్టుకుని ఒక్క నవ్వు నవ్వాడంటే చాలు ఫిదా…అలా మొదలైంది, భీమిలి కబడ్డి జట్టు, జెర్సీ, MCA, నిన్ను కోరి ఇలా వరుస సినిమాల్లో ఎంతో మంది హీరోయిన్స్ నాని పక్కన నటించారు..
కానీ నివేధ – నాని పెయిర్ మాత్రం సూపర్ గా వర్కౌట్ అయి హిట్ పెయిర్ గా నిలిచారు..అదేంటో నాని ,నివేధ కలిసి నటించిన ప్రతి సినిమాలో కూడా నాని నెగటివ్ రోల్ పోషించాడు..ఇప్పటివరకు వీరు కలిసి నటించిన(నటించబోతున్న) సినిమాలు మూడు జెంటిల్మన్, నిన్ను కోరి మరియు V..
జెంటిల్మన్ :
ఈ సినిమా లో నాని డబుల్ రోల్ పోషిస్తే..ఇదే సినిమాతో నివేధ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.. హీరోయిన్ గా మంచి మార్క్స్ కొట్టేసింది.జెంటిల్మన్ లో నాని మంచి వాడే అయినప్పటికి మంచి వాడిగా నటిస్తూ చెడ్డవాడిగా కనిపించే క్యారెక్టర్ లో కనిపిస్తాడు..అర్దం కాలేదు కదా.. సినిమా చూసినవాళ్లకి అర్దం అయిపోతుంది..కరోనా భయంతో ఇంట్లోనే ఉంటున్నారు కదా.. చూడకపోతే చూసేయండి..మంచి టైం పాస్..
Advertisements
Advertisement
నిన్ను కోరి :
నానిలో మరో యాంగిల్ ని పీక్స్ లో చూపించిన సినిమా..ఈ సినిమాలో నాని ఎంట్రీ హైలైట్ అసలు.. ..తాను ప్రేమించిన అమ్మాయి భర్తని వదిలి వచ్చేయాలని ఆరాటపడే విరహ ప్రేమికుడి పాత్ర…ఈ సినిమాలో ప్రతి పాత్ర మన మనసు దోచుకుంటుంది.. భార్య ప్రేమ విషయం తెలిసినా తన ప్రేమ పంచే భర్త పాత్రలో ఆది, భర్త ప్రేమను అర్దం చేసుకుని లవర్ ని మర్చిపోయే మంచి భార్యగా నివేధా.. నివేధా తండ్రి పాత్రలో మురళీ శర్మ..ఇలా ప్రతి ఒక్కరూ మంచివాళ్లే..ఆఖరికి మన బ్యాడ్ గయ్ నాని కూడా ఏడిపించేస్తాడు..
V : కరోనా లేకపోతే ఈ పాటికి సినిమా రిలీజ్ అయిపోయి ఉండేది.. టైటిల్ కింద క్యాప్షన్ ఏం లేకపోయినా V ఫర్ విలన్ అని టాక్..నాని గెటప్, ట్రైలర్ చూస్తుంటే నానిది నెగటివ్ రోల్ అని కన్ఫామ్ అయిపోతుంది.కానీ అసలు కాన్సెప్ట్ ఏంటనేది ఒక పట్టానా అర్దం కావట్లే… “వస్తున్నా..వచ్చేస్తున్నా..వద్దంటే వదిలేస్తానా” అనే సాంగ్ చూస్తే మాత్రం ఏదో ట్రయాంగిల్ లవ్ స్టోరీలా అనిపిస్తుంది.. ప్రేమ,హత్యలు..వీటికి నాని కి లింక్ ఏంటో..ఈ సినిమాలో కూడా హీరోయిన్ నివేధా ధామస్..
Advertisements