Advertisement
2002 నాట్ వెస్ట్ సిరీస్ ఫైనల్ లో గెలిచాక గంగూలీ షర్ట్ విప్పి గాల్లో తిప్పిన సీన్ ప్రతి క్రికెట్ లవర్ కు చిరకాలం జ్ఞాపకముండే మెమొరీనే.! అయితే చాలా రోజుల తర్వాత ఆ సీన్ వెనుక జరిగిన డైలాగ్స్ ను ఆ విక్టరీ కి కారణమైన కైఫ్ & యువరాజ్ షేర్ చేసుకున్నారు.
326 టార్గెట్ ..అప్పటికే 5 పెద్ద వికెట్స్ పడిపోయాయి. టీం ను నడిపే బాధ్యత కైఫ్ & యువరాజ్ తీసుకున్నారు… మెల్లిగా ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. రన్ రేట్ పెరిగిపోతుంది… లాడ్స్ పెవిలియన్ నుండి గంగూలీ..కైఫ్ ను ఉద్దేశించి సింగల్ తీయ్ …సింగల్ తీయ్ అని అరుస్తున్నాడు… ఈ సన్నివేశంపై ..ఇంస్టాగ్రామ్ లైవ్ లో కైఫ్ & యువరాజ్ మాట్లాడుకున్నారు .
Advertisement
- కైఫ్ : దాదా అరవడం నాకు గుర్తుంది …”సింగల్ తీయ్ …సింగల్ తీయ్.. స్ట్రైక్ యువరాజ్ కు ఇవ్వు అని అంటూ”
- యువరాజ్: దాదా స్ట్రైక్ నాకివ్వమని అన్నాడు మరి నెక్స్ట్ బాల్ కు నువ్వేం చేసావ్?
- కైఫ్ :నెక్స్ట్ బాల్ …బౌలర్ షార్ట్ బాల్ వేసాడు ..నేను పుల్ షాట్ కొట్టాను …బంతి సిక్స్ వెళ్ళింది
- యువరాజ్: సిక్స్ కొట్టాక ఏం అన్నావో గుర్తుందా…నా దగ్గరికి వొచ్చి నాకు పంచ్ ఇచ్చి … “నేను కూడా ఆడడానికే వొచ్చా” అన్నావు. ఆ తర్వాత దాదా కూడా సైలెంట్ అయ్యాడు ..కైఫ్ కూడా సిక్సులు కొడతాడని అప్పుడే తెలుసుకున్నాడు కాబోలు ..!
- కైఫ్ : హా హా …నాకు ఏదో చెప్పాలని .. వాటర్ బాటిల్ తో పాటు సందేశాన్ని కూడా రెడీ చేసాడు ..ఆ సిక్స్ తర్వాత వాటర్ బాటిల్ రాలేదు సందేశమూ రాలేదు…
Advertisements
ఈ మ్యాచ్ లో కైఫ్ 75 బాల్స్ లో 87 , యువరాజ్ 69 పరుగులు చేసారు. దీంతో ఇండియా 2 వికెట్స్ తేడాతో సిరీస్ గెలిచింది..గంగూలీ షర్ట్ గాల్లో తిరిగింది…ప్రతి ఇండియన్ ఎద గర్వంతో ఉప్పొంగింది
Advertisements