Advertisement
గూగుల్ వంటి కంపెనీలో ఉద్యోగం రావాలి అంటే గట్స్ ఉండాలనే మాట ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు అందులో పని చేయడం ఒక కల అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వేరే కంపెనీల్లో ఉద్యోగం రాని వాళ్లకు గూగుల్ లో మాత్రం చాలా ఫాస్ట్ గా ఉద్యోగం వస్తుంది. దానికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం.
Also Read:ఏ వాషింగ్ మెషిన్ బెస్ట్…? ఫ్రంట్ లోడ్ ఆర్ టాప్ లోడ్…? బట్టలు ఎక్కువ కాలం ఉండాలంటే అదే…!
మొదట్లో గూగుల్ లో ఉద్యోగం రావాలంటే కనీసం పి.హెచ్.డి చేసి ఉండాలి అనే భావన ఉండేది చాలా మందికి. కాని గూగుల్ ఆలోచన కాల క్రమేణా మారింది అనే చెప్పాలి. తన ఉద్యోగస్థులకు గూగుల్ కంపెనీ ఎప్పుడూ వాల్యూ ఇస్తుంది. అన్ని స్తాయిల ఉద్యోగాలను ఇప్పుడు గూగుల్ కంపెనీ కల్పిస్తుంది. ప్రస్తుతం గూగుల్ డిగ్రీ పాస్ అవ్వకపోయినా సరే ఉద్యోగం ఇస్తుంది. కాకపోతే మీలో టాలెంట్ చాలా బాగుండాలి.
Advertisement
Advertisements
గూగుల్ తమ దగ్గరకు వచ్చే ఉద్యోగార్థుల్లో విద్యా నైపుణ్యాలకు సంబంధించి ఒక మూసలో పడకుండా… నైపుణ్యం ఉన్న వారిని తీసుకునే ప్రయత్నం చేస్తుంది. కొన్ని కంపెనీలు ఏమో తమ దగ్గరకి వచ్చే వాళ్లకు అది ఉండాలి, ఇది ఉండాలి అనే ఆలోచనలో ఉంటూ ఉంటారు. ఆ కంపెనీలు ఏ ఒక్కటి కూడా సరిగా టాలెంట్ చూసే పరిస్థితి లేదు. కాని గూగుల్ మాత్రం వేరే కంపెనీల్లో రిజెక్ట్ అయిన వారికి ప్రాధాన్యత ఇస్తుంది. ఇక వాళ్ళు వద్దన్నా గూగుల్ తమకు ఉద్యోగం ఇచ్చింది అనే భావనలో ఉండి చాలా మంది ఉద్యోగాలు సమర్ధవంతంగా చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు.
Advertisements
Also Read:అఘోరాలు శవం మాంసం ఎందుకు తింటారు…?