Advertisement
సర్దార్ వల్లభాయ్ పటేల్…దేశ స్వాతంత్ర్య పోరాటంలో…స్వాతంత్ర్యానంతరం దేశాన్ని ఐక్యం చేయడంలో ప్రముఖ పాత్ర వహించారు.! సర్దార్ పటేల్ అనగానే ఆయన ధీరత్వం ఎలా సాక్షాత్కరిస్తుందో…. ఆయన కూతురు మనిబెన్ పటేల్ పేరు చెప్పగానే ఆమె నిజాయితీ అలా స్పురణకు వస్తుంది.!
తండ్రి పటేల్ మరణం తర్వాత…మనిబెన్ ఓ బ్యాగ్ ను తీసుకొని గుజరాత్ నుండి ఢిల్లీకి వెళ్లి నెహ్రూను కలిసింది! నెహ్రూ కు అర్థం కాలేదు…ఆ బ్యాగ్ తెరిచి చూసేవరకు 35 లక్షలు దానికి సంబంధించిన అకౌంట్ పుస్తకం ఉంది. అప్పుడు మనిబెన్..నాన్నగారు చనిపోయే సమయంలో ఈ లెక్క మీకు అప్పజెప్పమన్నారు… ఇవి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లెక్కలు అని చెప్పింది.
Advertisement
వాస్తవానికి అప్పటికే మనిబెన్ ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది.! తండ్రి ఇచ్చిన డబ్బులు నెహ్రూకు ఇవ్వాల్సిన అవసరం కూడా తనకు లేదు. కానీ ప్రజలిచ్చిన విరాళాలు ఆ పార్టీకే ఇవ్వాలని ఇచ్చేసింది. తన అంతిమ గడియాల్లో మనిబెన్ దుర్బర పరిస్థితులను గడిపింది. ఆరోగ్యం సహాకరించక….కండ్లు సరిగ్గా కనబడక ..నడుస్తూ నడుస్తూనే కిందపడిపోయేది.
Advertisements
Advertisements
పటేల్ దేశాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించారు కానీ ఆయన కూతురికి ఆర్థికంగా అండగా నిలబడడంలో మాత్రం దేశం విఫలమయ్యింది.!