Advertisement
నా హజ్బెండ్ నా నుండి కట్నం తీసుకోలేదు అని చెప్పగానే చాలామంది నుండి వచ్చే సమాధానం ఒకటే.. ఇంత అందమైన అమ్మాయి సొంతం అవుతుంటే ఇంక కట్నం ఎందుకు అని…వాళ్ల మాటలకు నవ్వు వస్తుంది..యట్ ద సేమ్ టైమ్ బాధ కూడా కలుగుతుంది. నా అందం వెనుక ఉన్న గాయాల్ని, ఆ గాయాల్ని కాదనుకుని మరీ నన్ను పెళ్లి చేసుకున్న మా ఆయన మంచితనం వారికెందుకు అర్దం కాదు అని..
ఆ రోజు నా ఆఫీస్ లాస్ట్ వర్కింగ్ డే.. మరో నెలరోజుల్లో నా పెళ్లి.. అందుకే నెల ముందుగా లీవ్ పెట్టాను..నెలపాటు ఇంట్లో ఉండి పెళ్లికి ముందుగా ప్రిపేర్ కావాలని ,పెళ్లి తర్వాత కూడా కొన్ని నెలలు సెలవుతీసుకోవాలని ముందే నిర్ణయించుకున్నాను.. లాస్ట్ డే ఆఫీస్ క్యాబ్ మిస్ అయింది..కార్లో వెళ్తే లేట్ అవుతుందని.. స్కూటి తీసుకుని బయల్దేరాను..ఎక్కువ రద్దీలేని రూట్లో వెళ్లాలని డిసైడ్ అయ్యాను..
సగం దూరం వెళ్లగానే నాలుగు కుక్కలు నన్ను వెంబడిస్తున్నాయని అర్దం అయింది..భయంతో స్పీడ్ పెంచాను.. వెనక వస్తున్న కుక్కల వైపు చూస్తూ ముందు గమనించకుండా చాలా స్పీడ్ గా వెళ్లి … ఏం జరిగిందో అర్దం కాలేదు.. కాసేపటికి నా హెల్మెట్ పైన ఉండే షీల్డ్ ముక్కముక్కలు అయి నా ముఖానికి గుచ్చుకుంది..ఎడమ చేతికి చిన్నగా స్క్రాచెస్ అయ్యాయి.. నా బండి ముక్కలయింది.. నా పర్స్ ,మొబైల్ అన్ని చెల్లాచెదురయ్యాయి..నా చుట్టూ జనం మూగారు..
అతి కష్టంమీద మొబైల్ తీసుకుని నా కాబోయే భర్తకి కాల్ చేసాను..అప్పటికి అఫిషియల్ గా ఇంకా ఎంగేజ్మెంట్ కాలేదు.. “నాకు యాక్సిడెంట్ జరిగింది.” అని చెప్పి కాల్ కట్ చేసాను.
Advertisements
Advertisement
కాసేపటికి హాస్పిటల్లో ఉన్నాను…నా పక్కనే తను ఉన్నాడు..డాక్టర్లతో చెప్తున్నాడు..తలకి ఏదైనా గాయం అయిందేమో చెక్ చేయమని.. రెండు రోజుల తర్వాత నా ముఖం నేను చూసుకోవడానికే భయం కలిగింది.. వాచిపోయింది.. ముఖం అంతా బ్యాండేజ్.. అతడిని పిలిచి మీరు పెళ్లి క్యాన్సిల్ చేసేయండి అన్నాను..దానికి అతను నవ్వి నేను నిన్ను పెళ్లిచేసుకోవాలని మాత్రమే డిసైడ్ అవ్వలేదు..నేను నిన్ను ప్రేమించాను.. నిన్ను ఇలాంటి టైంలో వదిలేసి వెళ్లడానికి ప్రేమించలేదు.. అయినా ఇవన్ని ఆలోచించకు ఇండియాలోమంచి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి అని ..నా అరిచేతిని తన చేతుల్లోకి తీసుకుని నొక్కి చెప్పాడు..
ఆ క్షణం నా కళ్లవెంట కారిన కన్నీరు బాధ,సంతోషం మిలితమై ఆ ఫీలింగ్ చెప్పడానికి మాటలు సరిపోవు.. తను అంతకుముందు చాలాసార్లు నాకు లవ్ యూ చెప్పాడు,ప్రేమిస్తున్నాని చెప్పాడు..కానీ ఈ సారి నిజంగా ఇది అతనికి ,అతని ప్రేమకు పరీక్ష..నేను పెట్టింది కాదు దేవుడు పెట్టిన పరీక్ష..మా ప్రేమ ఎంత బలమైందో మా కుటుంబాలకు నిరూపించుకునేందుకు మాకు ఎదురైన పరీక్ష.. అనుకున్న టైంకే మా పెళ్లిజరిగింది..కాని పెళ్లప్పటికి నా ముఖంపై మచ్చలు అలానే ఉన్నాయి.. తర్వాత కొన్నాళ్లకి స్కిన్ ట్రీట్మెంట్ తీసుకున్నాను..మళ్లీ మునుపటిలా తయారయ్యాను.. ఇప్పుడు మీరు చూసే ముఖం కింద ఉన్న మచ్చల్ని కూడా ఇష్టపడి నన్ను పెళ్లి చేసుకున్న తను నిజంగా చాలా గ్రేట్..
ఇలాంటి ప్రేమకథలు, ప్రేయసిప్రియుల గురించి మనం కథల్లోనే చదువుతుంటాం..కానీ కథల్లో చదివే రాజకుమారుడు లాంటి ప్రేమికుడు నా జీవితంలో ఉన్నందుకు నేను ప్రతిరోజు సంతోషపడుతూ ఉంటాను.. చాలామంది నా అందాన్ని పొగుడుతారు..కానీ ఆ అందం కంటే మిన్న అయిన అతని మనసు నాకు మాత్రమే తెలుసు..దాన్నెప్పుడూ పదిలంగా దాచుకోవాలని, ఆ మనసులో నా స్థానం సుస్థిరం చేసుకోవాని కోరుకుంటూ ఉంటాను..!
Advertisements