Advertisement
సరిగ్గా మూడేళ్ల క్రితం మాకు తినడానికి మూడు పూటల ఫూడ్ కూడా ఉండేది కాదు.. ప్రపంచంలో కష్టాలన్ని మాకే వచ్చాయా అన్నట్టుగా ఉండేది పరిస్థితి.. ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్నాం.. ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం..సంతోషంగా బతకొచ్చు అనుకున్నాం..కానీ అంత తలకిందులు అయింది..
ఏం జరుగుతుంది..ఎందుకు జరుగుతుంది అనేది కూడా తెలిసేది కాదు.. నా ఉద్యోగం పోయింది..కనీసం ప్రతీక్ అయినా జాబ్ చేస్తున్నాడు అనుకుంటే..తన ఉద్యోగంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వచ్చేది..చివరికి తనను కూడా ఉద్యోగం నుండి తీసేశారు.. మా దగ్గర ఉన్న గోల్డ్ బ్యాంక్ లో తాకట్టు పెట్టి లోన్ తీసుకుని కొన్ని రోజులు నెట్టుకొచ్చాం.. కానీ కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి కదా.. చేతిలో డబ్బులు అయిపోయాయి.
ఉద్యోగాల కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు.. ఉద్యోగాలు దొరకట్లేదని, బిజినెస్ స్టార్ట్ చేద్దామని బ్యాంక్ దగ్గర లోన్ తీసుకుని బిజినెస్ స్టార్ట్ చేసాం..అక్కడా లాసే..బ్యాంక్ అప్పులు కట్టలేకపోయాం..బ్యాంక్ నుండి ఫోన్స్ వస్తే భయం వేసేది.. చుట్టు పక్కల వాళ్ల ముందు తల ఎత్తుకు తిరగలేకపోయేవాళ్లం..
Advertisement
కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులైందో మాకే తెలీదు..మేం ఇష్టంగా పెంచుకున్న కుక్కపిల్లలకు కూడా మేం ఫూడ్ పెట్టలేని పరిస్థితి..కొత్తగా పెళ్లైన జంట ఎంత సంతోషంగా ఉంటారు..కానీ మా మధ్య ఆ సంతోషం కూడా లేదు…కొన్నిసార్లు చచ్చిపోవాలనిపించేది..ఇతన్ని పెళ్లి చేసుకుని తప్పు చేసానా అనిపించేది..విడాకుల ఆలోచన వచ్చేది..కానీ అది క్షణం కాలంపాటే..కష్టమైనా,సుఖమైనా ప్రతీక్ తో కలిసే పంచుకోవాలని నిర్ణయించుకున్నాను..
Advertisements
ఒకరోజు మా నాన్న వచ్చారు..ఒకే మాట చెప్పారు.. మీరు ఎవరికి చెడు చేయలేదు..మీరు చేసిన మంచి ఏదో రూపంలో మీకు చేరుతుంది.. గుండె నిబ్బరం చేసుకుని బతకండి.. “ఈ క్షణం వెళ్లిపోతుంది”అంటూ మా నాన్న చెప్పిన మాటలే నిజం అయ్యాయి.. మళ్లీ మాకు ఉధ్యోగాలొచ్చాయి… గత అనుభవం దృష్టిలో పెట్టుకొని డబ్బును వృథాగా ఖర్చు చేయడం కంటే కూడా జమ చేయడంపై దృష్టిపెట్టాము.! అలా ఇప్పుడు మా దగ్గర 5 సంవత్సరాలు కనీస అవసరాలకు సరిపోయే డబ్బును కూడబెట్టగలిగాము.! మా పప్పిస్ ని మేం ఇంటికి తెచ్చుకున్నాం.. ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాం!
Advertisements
జీవితంలో ఎత్తుపల్లాలు,కష్టసుఖాలు సహజం..నిజానికి కష్టాలనేవి మనల్ని బాధ పెట్టడానికి రావు..మనం ఎలా బతకాలో నేర్పించడానికి వస్తాయి..మనల్ని మనం మరింత బలోపేతం చేసుకోవడానికి వస్తాయి.అందుకే సమస్యల్లో ఉన్నాం అని ఎవరైనా బాధపడితే వారికి ఒక్కటే చెప్తాను.. “ఈ క్షణం వెళ్లిపోతుంది..”..!