Advertisement
మేఘన, రాహుల్ చూడచక్కని జంట..పెద్దలు కుదిర్చిన వివాహం..నిశ్చయతాంబుళాల తర్వాత ఆరునెలల్లో పెళ్లి అనగా వాట్సప్ ఛాటింగ్స్,ఫోన్ కాల్స్ పరిచయంతో ఒకర్నొకరు అర్దం చేసుకున్నారు..వివాహం జరిగింది..మేఘన రాహుల్ ఇంటికి కొత్త కోడలిగా వచ్చింది..
ఇద్దరివి మధ్య తరగతి కుటుంబాలే..ఆస్తులు సంపాదించకపోయినా కూతుర్ని చదివించేంత సంపాదించాడు మేఘన తండ్రి.. మేఘన కష్టపడి చదివింది, ఉద్యోగం సంపాదించింది.. తన కాళ్లపై తను నిలబడగలిగింది..ఆత్మవిశ్వాసం ఎక్కువ.. రాహుల్ తండ్రి తన ఐదేళ్ల వయసప్పుడు ట్రెయిన్ యాక్సిడెంట్లో మరణించాడు.. తల్లి బట్టలు కుడుతూ కుటుంబాన్ని పోషించేది… తను చదువుకోలేకపోయింది..కొడుకుని చదివించాలని ఆశపడింది..చదివించింది.. తల్లి ఆశపడ్డట్టుగానే రాహుల్ బాగా చదువుకున్నాడు.. ప్రైవేట్ హాస్పిటల్లో సర్జన్ గా చేరాడు..
పెళ్లి తర్వాత కూడా మేఘన ఉద్యోగం మానలేదు.. రాహుల్ తనని తనలా యాక్సెప్ట్ చేశాడు..తన కోసం తన తల్లికోసం మేఘన ఇష్టాల్ని వదులుకోవద్దన్నాడు.. ఇక్కడే అసలు చిక్కొచ్చింది.. మేఘకి చెడ్డబుద్దులు లేవు, కానీ తనకు చదువుకోనివారంటే కొంత చులకనభావం..ఆ విషయంగా అత్తగారంటే ఛీత్కారం..తనని బయటకు తీసుకెళ్లడానికి నామోషి ఫీలయ్యేది..అత్తగారి కట్టుబొట్టు,మాటతీరు మేఘనకు ఇబ్బందిగా ఉండేవి..
ఒకరోజు మేఘన ఫ్రెండ్స్ కిట్టి పార్టికి ఇంటికొచ్చారు..వారందరికి కావలసినన సపర్యలు చేసింది మేఘన అత్త.. వాళ్లందరూ ఎవరు ఈవిడ అని అడిగితే క్షణం ఆలోచించకుండా పనిమనిషి అని చెప్పింది..ఆ మాటకు అత్తగారి మనసు కలుక్కుమన్నా,బాధ దిగమింగుకుంది తప్ప నోరు విప్పలేదు..రోజులు గడుస్తున్నాయి..రాహుల్ కి మేఘన ప్రవర్తన విసుగ్గా ఉంటుంది..కానీ ఏం చేయలేని పరిస్థితి.. ఒన్ ఫైన్ డే మేఘన ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసింది..
Advertisements
Advertisement
కోడల్ని కంటికి రెప్పలా చూసుకుంది ..మేఘన పండంటి బిడ్డకు జన్మనిచ్చింది..మెటర్నిటి లీవ్ అయిపోయింది..మేఘన ఆఫీస్ కి తిరిగి వెళ్లాలనుకుంది, తన బిడ్డను చూసుకోవడం ఎలా అనే డైలమాలో పడింది..అప్పుడే ఆఫీస్లో మంచి ప్రాజెక్ట్ వచ్చింది..ఏం చేయాలో పాలుపోక ఉద్యోగం వదులుకోవడానికి సిద్దపడింది.అప్పుడు అత్తగారు కోడలి దగ్గరకొచ్చి..బాబుని నేను చూసుకుంటాను ,నువ్వు నీ ఉద్యోగం చేసుకోఅని భరోసానిచ్చారు.
బాబు,వాళ్ల నాన్నమ్మ సంరక్షణలో ఆరోగ్యంగా ,ఆనందంగా పెరగడం మేఘన గమనిస్తూనే ఉంది..బాబు ఏడిస్తే ఊరుకోబెట్టడానికి,నిద్ర పుచ్చడానికి, ఆకలేస్తే తినిపించడానికి,మేఘన చాలా కష్టపడేది..కొన్ని సార్లు అరిచేది..పాపం అమ్మ అరుపులు వాడికి అర్దం కాక ఇంకా గట్టిగా ఏడ్చేవాడు..కానీ అత్తగారు మెల్లిగా చెప్తూ వాడిని క్షణాల్లో ఏడుపాపేలా చేయడం, జోలపాడుతూ నిద్రపుచ్చడం ఇవన్ని మేఘన ప్రశాంతంగా ఉండేలా చేశాయి..
Advertisements
ఒకరోజు అత్తగారి దగ్గరకువెళ్లి తన చేతులు పట్టుకుని క్షమాపణలు కోరుతూ హగ్ చేసుకుంది.. ఈ దృష్యం చూసిన రాహుల్ కి చాలా సంతోషం అనిపించింది..ఇన్నాళ్లకి మేఘన తన తల్లిని అర్దం చేసుకున్నందుకు చాలా సంతోషపడిపోయాడు… మరో ఫైన్ డే నాడు మేఘన అత్తగారిని తీసుకుని రెస్టారెంట్ కి వెళ్లింది..తనతో చాలా టైం స్పెండ్ చేసింది.. రాహుల్ కి తన బేబితో ఆడుకునే టైం దొరికింది.అత్తాకోడళ్లు రెస్టారెంట్లో మాటల్లో బిజి… నాన్నా కొడుకులు ఇంట్లో ఆటల్లో బిజి బిజి..!