Advertisement
సెల్ఫీ నూతన వధూవరుల ప్రాణాలు తీసింది. పెళ్ళై ౩ నెలలు కూడా గడవకముందే వారు మృత్యువాత పడ్డారు. కర్ణాటక లోని హసన్ జిల్లాకు చెందిన కృతికా అర్తేష్ ల వివాహం మార్చిలో జరిగింది. బెంగళూరు లో ఉంటున్న వీరు ….లాక్ డౌన్ కారణంగా సొంతూరికి వొచ్చారు. కొన్ని రోజులు అర్తేష్ ( వరుడు) ఇంట్లో గడిపిన వీరు …కృతికా అమ్మగారింటికి వెళ్లాలని బైక్ పై బయలుదేరారు. మార్గమధ్యలో ఉన్న హేమావతి నది డ్యామ్ వద్ద ఆగి సెల్ఫీలు తీసుకునే క్రమంలో జారీ నదిలో పడ్డట్టు తెలుస్తోంది.!
Advertisement
వధువు ఇంటికి బయలు దేరిన జంట నుండి ఎటువంటి సమాచారం లేకపోవడం, ఫోన్ లు స్విచ్ ఆఫ్ రావడంతో…అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు పిర్యాదు చేసారు. ఇంతలోనే స్థానిక మత్స్యకారులు హేమావతి నదిలో రెండు శవాలను బయటికి వెలికితీసి పోలీసులకు తెలియజేసారు. మరణించిన వారిని కృతికా అర్తేష్ లుగా గుర్తించారు.
Advertisements