Advertisement
నేను ఓ బట్టల షాపులో పనిచేసే సాధారణ మహిళను…నా వయస్సు 30 ఏళ్ళు. ఎప్పటిలాగే ఆ రోజు కూడా డ్యూటీ నిమిత్తం వెళుతున్నాను. ఆ రోజు ఉదయం నుండే వర్షం కురుస్తూ ఉంది. అయినా తప్పదు కాబట్టి ఆ వర్షంలో తడుస్తూనే బస్ స్టాండ్ దగ్గర బస్ కోసం ఎదరుచూస్తున్న…అప్పటికే వర్షానికి నేను వేసుకున్న డ్రెస్ అంతా తడిసి పోయింది.
బస్ వచ్చింది. జనాల్లో తోసుకుంటూనే బస్ ఎక్కాను. బస్ లో ఉన్న మగాళ్లంతా నన్ను వింతగా చూస్తున్నారు. తీరా నన్ను నేను గమనించుకున్నాక తెలిసింది. వారు చూసేది వింతగా కాదు రోతగా అని.! తడిసిన నా డ్రెస్ లో నుండి నా నగ్నత్వాన్ని వెతుకున్నాయి వారి కళ్ళు.! హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న స్కార్ఫ్ ను తీసి ఒళ్లంతా కవర్ అయ్యేలా కప్పుకున్నా..అయినా దొంగతనంగా ఇంకేమైనా కనిపిస్తాయేమోనని కొన్ని కళ్ళు వెతుకుతూనే ఉన్నాయి.
నేను దిగాల్సిన స్టేజ్ వచ్చింది. నా పనిలో నేను నిమగ్నమయ్యా…అంతలోనే ఇంటి దగ్గరి నుండి ఫోన్…మా పాపకు నిప్పంటుకొని ఒళ్లంతా కాలిందని ఆ ఫోన్ సారాంశం. విషయాన్ని ఓనర్ కి చెప్పి నేను ఇంటికి బయలు దేరా.! 30 నిమిషాల నుండి ఎదురుచూస్తున్నా ఇంకా బస్ రాలేదు. వర్షం మాత్రం ఇంకా వేగం పెంచింది. పాప పరిస్థితి ఎలా ఉందోనని లోలోన టెన్షన్….ఇక తప్పదనుకొని క్యాబ్ బుక్ చేసుకొని బయలు దేరా.
పాపకు ఎలా ఉందో….పాపం నా చిట్టి తల్లి కాలిన బాధను ఎలా తట్టుకుందోనని ఆలోచిస్తూ నా గుండె భయంభయంగా కొట్టుకుంటుంది. అదే సమయంలో…క్యాబ్ డ్రైవర్ మిడిల్ మిర్రర్ నుండి నన్ను తదేకంగా చూస్తున్నాడు..ఈ సారి మరింతగా తడిసిన నా డ్రెస్ నుండి వాడి చూపులు మరింత లోపలికి………………. వాడి ఆకారం కూడా చాలా భయంకరంగా ఉంది. వాడు చూపులతో రేప్ చేసేంతగా చూస్తున్నాడు. మళ్లీ స్కార్ఫ్ ను నిండుగా కప్పుకున్నాను. ఈ సారి వాడి దృష్టి రోడ్డు మీద నడుస్తున్న అమ్మాయిలు, ఆంటీలు….అడవాళ్ళు కనిపిస్తే చాలన్నట్టుగా చూస్తున్నాడు.
Advertisements
Advertisement
క్యాబ్ వాడు కరెక్ట్ గానే తీసుకెళుతున్నాడా అనే భయం…. పాప పరిస్థితి ఎలా ఉందోనన్న ఆలోచనన…నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.! లోలోపలే దేవుడి దండం పెట్టుకున్నాను. చివరకు నేను దిగాల్సిన హాస్పిటల్ వచ్చేసింది. డ్రైవర్ ని ఎగిరితన్నాలన్నంత కోపం ఉన్నా…వాడికివ్వాల్సిన కిరాయి ఇచ్చేసి…పరిగెత్తుకుంటూ కూతురి దగ్గరికి చేరుకున్నా. కాలిన గాయాలకు ట్రీట్మెంట్ చేస్తున్నారు డాక్టర్… తనను మంటలు కాల్చాయి..నన్ను కామపు చూపులు కాల్చాయి అంతే తేడా.! బాధ మాత్రం అదే.!
Also Read: మొదట నా పర్సు కొట్టేసాడు…తర్వాత నా మనస్సు.! 5 ఏళ్ళ బంధం.! నా స్టోరీ.
Also Read: 6 ఏళ్ళ క్రితం….ఓ కుర్రాడితో వెళ్ళిపోయిన కూతురి గురించి తండ్రి మాటలు.!!
Advertisements
Also Read: ఆమె ట్రైన్ లో బయలుదేరింది..ఇక్కడ ఇతనికి టెన్షన్ స్టార్ట్ అయ్యింది….నిజమైన ప్రేమంటే ఇదేనేమో.!