Advertisement
అది 2001 ఉదయ్ కిరణ్ నువ్వు-నేను రిలీజ్ అయిన రోజు… హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ లో ఆ సినిమా డైరెక్టర్ తేజ ఆడియన్స్ తో కలిసి సినిమా చూస్తున్నాడు. ఇంటర్వెల్ టైమ్ లో ఒక కుర్రాడు తేజ కి భలే నచ్చాడు . అతని దగ్గరికి వెళ్లి హాయ్ నా పేరు తేజ ఈ సినిమా డైరెక్టర్ ని నీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా? అని అడిగాడు . చాలా ఇంట్రెస్ట్ అని చెప్పాడు ఆ కుర్రాడు . నిన్ను కాంటాక్ట్ చేయడానికి ఫోన్ నంబర్ ఉంటే ఇవ్వు అవసరమైనప్పుడు పిలుస్తా అని చెప్పాడు తేజ . ఆ కుర్రాడు నంబర్ ఇచ్చి థాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు .
తర్వాత ఆ కుర్రాడు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి కొడుకు నితిన్ అని తేజ కి తెలిసింది. నువ్వు నేను నైజం ఏరియా డిస్ట్రిబ్యూటర్ కూడా సుధాకర్ రెడ్డి నే.! నువ్వు నేను పెద్ద హిట్ కావడంతో తేజ కి పెద్ద హీరోస్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయి . అందులో అల్లు అరవింద్ అబ్బాయి అల్లు అర్జున్ ని లాంచ్ చేయాలనే ఆఫర్ కూడా ఒకటి . తేజ జయం మూవీ స్క్రిప్ట్ రెడీ చేసి దానికి అల్లు అర్జున్ ని హీరోగా అనుకున్నాడు. ఒకసారి టెస్ట్ షూట్ చేసాక ఆ క్యారెక్టర్ కి అతను సెట్ అవ్వట్లేదు సర్ , నెక్స్ట్ మూవీకి ట్రై చేద్దాం సారీ అని అల్లు అరవింద్ కి చెప్పేసాడు తేజ . తర్వాత చాలామందిని ట్రై చేసాక కరెక్టుగా నువ్వు నేను 150 వ రోజు నితిన్ కి కాల్ చేసాడు తేజ . నితిన్ ఆగమేఘాల మీద వచ్చేశాడు , ఫోటో షూట్ చేసి హీరోగా నితిన్ ను ఫైనల్ చేసుకున్నాడు. తర్వాత ముంబై కోఆర్డినేటర్ ద్వారా సదా ని హీరోయిన్ గా తీసుకున్నారు. విలన్ గా కూడా ముంబై అతన్ని తీసుకున్నారు . ముందుగా సాంగ్స్ రికార్డ్ చేశారు .
విలన్ గా గోపిచంద్:
2002 ఫిబ్రవరి లో షూటింగ్ స్టార్ట్ చేశాక….విలన్ పై కొన్ని సీన్స్ తీశారు…అందులో విలన్ యాక్టింగ్ తేజకు నచ్చలేదు..దీంతో అతడిని తప్పించి గోపిచంద్ కి కాల్ చేశాడు తేజ! ఫేమ్ లో ఉన్న దర్శకుడి నుండి ఫోన్ రావడంతో హీరో ఆఫర్ అనుకొని తేజ ఆఫీస్ కు వచ్చాడు గోపీచంద్… లుక్ టెస్ట్ చేసాక జయం మూవీలో విలన్ రోల్ ఉంది చేస్తావా అని అడిగాడు తేజ . విలనా అని కాస్త ఆలోచించి సరే అన్నాడు గోపిచంద్ .
గోపిచంద్ అమ్మతో పాటు చాలామంది సన్నిహితులు విలన్ క్యారెక్టర్ వొద్దని చెప్పారు . అయినా తేజ మీద నమ్మకంతో విలన్ రోల్ కు ఓకే చెప్పాడు గోపీచంద్
Advertisements
సదాని కొట్టిన తేజ?
Advertisement
సదా కి ఒక సీన్ లో ఏడవడం రావట్లేదు అని తేజ సదా ని చెంపమీద కొట్టాడంట?! దాంతో సదా నిజంగా ఏడుస్తూ ఆ సీన్ చేసిందట. జస్ట్ 65 డేస్ లోనే ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది!
1.80 కోట్లతో తెరకెక్కిన సినిమా:
1.80 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమాను మొదట 58 ప్రింట్లతో జూన్ 14 2002 లో రిలీజ్ చేశారు. పెద్ద హీరోకి వచ్చిన ఓపెనింగ్స్ వచ్చాయి ఈ సినిమాకి ! స్టోరీ పాతదే, కానీ స్క్రీన్ ప్లే కొత్తది! హీరో హీరోయిన్ విలన్ క్యారెక్టర్స్ చాలా ఫ్రెష్ గా అనిపించాయి . ఓపెనింగ్ సీన్ నుండే ఇంట్రెస్టింగ్ గా వెళ్తూ కామెడీతో నవ్విస్తూ , హీరో హీరోయిన్ లవ్ సీన్స్ తో ఆకట్టుకుంటూ కొనసాగుతున్న సినిమా ఇంటర్వెల్ లో పీక్స్ కు వెళ్లింది….. సెకండ్ ఆఫ్ నుంచి ప్రేక్షకులు కుర్చీలోంచి కదలకుండా టైట్ స్క్రీన్ ప్లే తో కట్టిపడేశాడు తేజ! ఈ సినిమా చూసి నిజంగా లేచి పోయిన ప్రేమికులు కూడా ఉన్నారు .
యాక్టర్స్
మొదటి సినిమా అయినా నితిన్ యాక్టింగ్ ఇరగదీశాడు… వెళ్లవయ్యా వెళ్లు అంటూ సదా చెప్పిన డైలాగ్ ఇప్పటికీ ఆమెకో గుర్తింపు! విలన్ గా గోపిచంద్ నటన వేరే లెవల్! ఈ సినిమాతో 30 మంది కొత్త నటులు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు, అందులో సుమన్ శెట్టి క్యారెక్టర్ బాగా క్లిక్ అయ్యింది. ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ అయ్యాడు!
సంగీతం
తేజ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే తో సినిమాని బ్లాక్ బస్టర్ చేయగా , ఆర్ పి పట్నాయక్ సంగీతం , ఆర్ ఆర్ తో ఈ సినిమాకి ప్రాణం పోసి నిలబెట్టాడు.
వీరి వీరి గుమ్మడి పండు అనే థీమ్ సాంగ్ సినిమా అంతా ప్లే అవుతూ ఉంటుంది . ప్రియతమా తెలుసునా , రాను రానంటూనే చిన్నదో , బండి బండి రైలు బండి , అనే పాటలు ఎవర్గ్రీన్ హిట్స్ .
బాక్స్ ఆఫీసు
Advertisements
58 ప్రింట్లతో రిలీజ్ అయిన ఈ సినిమా నాలుగు వారాల్లో 150 ప్రింట్లకు చేరింది. 70 సెంటర్లలో 100 రోజులు ఆడింది. 1.80 కోట్లతో తీసిన ఈ సినిమా టోటల్ 32 కోట్ల వరకు కలెక్ట్ చేసింది.! ముఖ్యంగా నైజాంలో జయం మూవీ ఒక చరిత్రను సృష్టించింది…అప్పటి వరకు నైజాంలో 7 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసిన సినిమాలైన ఖుషి, నువ్వేకావాలి సినిమాలను దాటేసింది! అలాగే బెస్ట్ డెబ్యూ హీరో గా నితిన్ , హీరోయిన్ గా సదా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకోగా . బెస్ట్ విలన్ గా గోపిచంద్ కు నంది అవార్డ్ దక్కింది.