Advertisement
ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషల్లో బిగ్ బాస్ షోను నిర్వహిస్తున్నారు. పలు చోట్ల బిగ్ బ్రదర్ పేరిట ఈ షో కొనసాగుతోంది. అయితే ఏ భాషకు చెందిన షో అయినా సరే.. అందులో మొదటి రూల్.. ఆ భాషలోనే మాట్లాడాలి. అంటే.. తెలుగు బిగ్‌బాస్ షో అయితే.. అందులో పాల్గొనే కంటెస్టెంట్లు తెలుగులోనే మాట్లాడాల్సి ఉంటుంది. కానీ కొందరికి మాత్రం తెలుగు రాకపోవడంతో గతంలోనే కాదు.. తాజాగా జరుగుతున్న బిగ్‌బాస్ షోలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక సీజన్ 1 నుంచి ఇప్పటి వరకు తెలుగు బిస్‌బాస్ షోలో పాల్గొన్న తెలుగేతర కంటెస్టెంట్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. మోనాల్ గజ్జర్:
ఈమెది నిజానికి గుజరాత్‌లోని అహ్మదాబాద్. తెలుగులో పలు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో కంటెస్టెంట్‌గా ఉంది. అయితే ఈమెకు తెలుగు మాట్లాడడం ఇబ్బందిగా ఉంది. దీంతో బిగ్‌బాస్ పదే పదే ఆమెను తెలుగు మాట్లాడాలని హెచ్చరిస్తున్నాడు.
Advertisements
2. అమ్మ రాజశేఖర్:
అమ్మ రాజశేఖర్‌ది చెన్నై. అయినప్పటికీ తెలుగు బాగానే మాట్లాడగలడు. ప్రస్తుతం బిగ్ బాస్ షోలో ఇతను ఉన్నాడు. అయితే టాస్క్‌ల్లో పాల్గొన్నప్పుడు ఇతను చేస్తున్న కొరియోగ్రఫిక్ స్టైల్స్ జనాలకు నచ్చడం లేదు.
3. సూర్య కిరణ్:
మళయాళ కుటుంబంలో జన్మించిన సూర్యకిరణ్ తెలుగు మాట్లాడగలడు. తెలుగులో పలు సినిమాలు తీశాడు. అందువల్ల ఈయనకు షోలో తెలుగు మాట్లాడడంలో సమస్య ఎదురు కాలేదు.
Advertisement
4. బాబా భాస్కర్:
కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ సీజన్ 3 లో పాల్గొన్నాడు. తెలుగు, తమిళం కలగలిపిన భాషలో మాట్లాడుతాడు. అయితే షోలో ఈయన తెలుగు మాట్లాడేందుకు ఇబ్బందులు పడ్డాడు.
5. పూజా రామచంద్రన్:
తెలుగు, తమిళంలో ఈమె పలు సినిమాల్లో నటించింది. గతంలో తెలుగు బిగ్‌బాస్ షోలో పాల్గొంది. షోలో తెలుగు మాట్లాడేందుకు ఇబ్బందులు పడింది. అయినప్పటికీ టాస్క్‌లను పూర్తి చేసేందుకు అది ఆమెకు అడ్డు కాలేదు.
6. దీక్షా పంత్:
జూనియర్ ఎన్‌టీఆర్ తొలి సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించినప్పుడు ఆ షోలో ఈమె పాల్గొంది. ఈమెది ముంబై. ఆ షోలో ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చింది. అయితే ఈమెకు తెలుగులో మాట్లాడేందుకు ఇబ్బందులు ఎదురు కాలేదు.
7. ముమైత్ ఖాన్:
సీజన్ 1లో ముమైత్ ఖాన్ పాల్గొంది. ఈమెది ముంబై. తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది. కానీ తెలుగు రాదు. దీని వల్ల షోలో ఇబ్బందులు పడింది. ముఖ్యంగా ఈమె కో కంటెస్టెంట్ ప్రిన్స్ ఈమె తెలుగులో మాట్లాడకపోవడం వల్ల అనేక సార్లు స్విమ్మింగ్ పూల్‌లో దూకాల్సి వచ్చింది. ఓ దశలో ప్రిన్స్ 50 సార్లు పూల్‌లో దూకాడు.
Advertisements