Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

NTR ప్రవేశ పెట్టిన 10 అద్భుత ప‌థ‌కాలు.! రాష్ట్ర ‌దిశ‌ను మార్చేశాయి.అవేంటంటే.!

Advertisement

నంద‌మూరి తార‌క రామారావు…తెలుగు వారికి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు.! ఆయ‌న ప్ర‌స్థానం రాష్ట్ర రాజ‌కీయాల్లో ఓ మైలురాయి! ఆయ‌న ప‌రిపాల‌న స‌రికొత్త మార్పుకు శ్రీకారం ! ధైర్యమైన నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాదు.. కేంద్రాన్ని సైతం ధైర్యంగా ప్ర‌శ్నించిన ధీశాలి….NTR. ఆ మ‌హానీయుడు త‌న పాల‌నాకాలంలో తీసుకొచ్చిన కొన్ని కొత్త ప‌థ‌కాలు రాష్ట్రాభివృద్దిని స‌మూలంగా మార్చేశాయి. ఇత‌ర రాష్ట్రాలు సైతం అన్న ప్ర‌వేశ‌పెట్టిన‌ సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను కొనియాడాయి.

NTR ప్రవేశ పెట్టిన 10 అద్భుత ప‌థ‌కాలు:

2 రూపాయ‌ల‌కే కేజీ బియ్యం
1983 లో త‌ను అధికారంలోకి రాగానే …పేద‌వాడి క‌డుపునింపాల‌నే ఉద్దేశంతో ఈ స్కీమ్ ను స్టార్ట్ చేశారు. అప్ప‌ట్లో ఇదో సంచ‌ల‌నం. కేంద్ర ప్ర‌భుత్వం సైతం ఈ స్కీమ్ ను కొనియాడింది.

మ‌ద్య‌పాన నిషేదం
పేద‌ల సంపాద‌‌న తాగుడుకే స‌రిపోతుంద‌న్న కార‌ణంతో మ‌ద్య‌పాన నిషేదాన్ని తీసుకొచ్చాడు.

Advertisements

EMCET
ఇంట‌ర్ అవ్వ‌గానే మ‌న‌కు గుర్తొచ్చే EMCET ను …ఇంప్లిమెంట్ చేసింది NTR యే.!

ప‌టేల్ ప‌ట్వారీ విధానం ర‌ద్దు
గ్రామ భూముల రెవెన్యూ వ్య‌వ‌స్థ‌ను త‌మ చేతులో పెట్టుకొని …పేద రైతుల‌ను అనేక క‌ష్టాల‌కు గురిచేస్తున్న ప‌టేల్, ప‌ట్వారీల అధికారాల‌ను తొల‌గిస్తూ ఓ గొప్ప నిర్ణ‌యం తీసుకొని పేద రైతులకు ఆనందాన్ని పంచాడు.

MGBS బ‌స్ స్టాప్:
నిజాం కాలంలో అంకురార్ప‌ణ జ‌రిగిన ఇమ్లీబ‌న్ బ‌స్టాండ్ ను … పూర్తిస్థాయిలో నిర్మించి ఆసియాలోనే పెద్ద బ‌స్ స్టాప్ MGBS ను తీర్చిదిద్దారు.

Advertisement

నెక్లెస్ రోడ్డు పై మ‌హానీయుల విగ్ర‌హాలు – హుస్సేన్ సాగ‌ర్ లో బుద్ద విగ్ర‌హం:
నెక్లెస్ రోడ్డు చుట్టూ ఉన్న తెలుగు వీరుల విగ్ర‌హాల‌ను ఏర్పాటు చేయించింది NTR యే., తెలుగు ఖ్యాతిని, సంస్కృతి, చ‌రిత్ర స్ప‌ష్ట‌మ‌య్యేలా ఈ విగ్ర‌హాల‌ను ఏర్పాటు చేయించారు. హుస్సేన్ సాగ‌ర్ లో ఠీవీగా నిల్చున్న బుద్దుడి విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసింది కూడా NTR యే.!


5 ల‌క్ష‌ల ఇండ్ల నిర్మాణం:
పేద‌ల కోసం త‌న 5 ఏళ్ల పాల‌న‌లో ….5 ల‌క్ష‌ల ఇండ్ల‌ను నిర్మించి ఇచ్చాడు. ఎంతో పేద‌ల‌కు గూడును క‌ల్పించారు.

శాస‌న మండ‌లి ర‌ద్దు:
ప్ర‌భుత్వానికి వృథా ఖ‌ర్చుగా కొన‌సాగుతున్న శాస‌న మండ‌లిని ర‌ద్దు చేశాడు. ఇదో విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యం.

స్కూల్స్ లో మ‌ద్యాహ్న భోజ‌న ప‌థ‌కం :
విద్య వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేయ‌డానికి ., పేద విద్యార్థుల‌ను చ‌దువు వైపు ప్రోత్సాహించే విధంగా ప్ర‌భుత్వ స్కూల్స్ లో స్కూల్స్ లో మ‌ద్యాహ్న భోజ‌న ప‌థ‌కం ప్రారంభించారు.

స్థానిక సంస్థ‌ల్లో రిజ‌ర్వేష‌న్స్: 
బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాలు సైతం రాజ‌కీయాల్లో ఎద‌గాల‌ని… స్థానిక సంస్ధ‌లో రిజ‌ర్వేష‌న్స్ ను తీసుకొచ్చారు.

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీని మ‌ద్రాస్ నుండి హైద్రాబాద్ కు త‌ర‌లింపు.

Advertisements