Advertisement
Jr.NTR ను స్టూడెంట్ నెం1 సినిమా హీరోగా నిలబెడితే ఆది స్టార్ హీరోను చేసింది. ఆ తర్వాత సింహాద్రి రికార్డుల మోతను మోగించి NTR ను ఎక్కడో నిలబెట్టింది. NTR సినీ జీవితాన్ని మార్చిన సింహాద్రి సినిమా ఎలా NTR చేతికి వచ్చింది…ఈ సినిమా రికార్డ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం!
ఆది సూపర్ హిట్ తర్వాత NTR చేసిన అల్లరి రాముడు, నాగా రెండు సినిమాలు అట్టర్ ప్లాప్ లుగా మిగిలాయి. ఆ తర్వాత రెండు సినిమాలనుకున్నారు అవి కొంత షూటింగ్ అయ్యాక ఆగిపోయాయి. ఎలాగైన ఓ పెద్ద హిట్ కొట్టాలనే కసితో కథలు వినడంలో బిజీ అయిపోయాడు NTR.
అదే సమయంలో …..రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఓ మాస్ కథను బాలకృష్ణ హీరోగా బి.గోపాల్ డైరెక్షన్ లో వచ్చే సినిమా కోసం రాశారు. కానీ బి. గోపాల్ వేరే కథను సెలెక్ట్ చేసుకోవడంతో ఈ కథ అలాగే ఆగిపోయింది. అదే కథను NTR కు వినిపించాడు విజయేంద్రప్రసాద్. NTRతో అంతకు ముందే స్టూడెంట్ నెంబర్ 1 రాజమౌళి ఈసినిమాకు డైరెక్టర్.
కథ వెనుక చిన్న స్టోరి:
వసంత కోకిల సినిమా క్లైమాక్స్ లో హీరో హీరోయిన్ ను వదిలివెళ్ళిపోయిన సన్నివేశాన్ని గురించి రైటర్ విజయేంద్ర ప్రసాద్ కు….. హీరోయిన్ హీరోని వదిలి వెళ్ళిపోతుంటే, గుండెల్లో గునపంతో పొడిచేసినట్టు అనిపించిందట…నిజంగానే …… హీరోని తను ప్రేమిస్తున్న హీరోయిన్ గునపంతో పొడిస్తే…..? అనే యాంగిల్ లో కథ రాయడం స్టార్ట్ చేశారట విజయేంద్రప్రసాద్ …..ఎందుకు పొడవాల్సి వచ్చిందో ఓ బలమైన బ్యాక్ డ్రాప్ ను క్రియేట్ చేస్తూ కథను రాసుకున్నారట!అలా పుట్టిందే సింహాద్రి స్టోరి!
Advertisements
Advertisement
షూటింగ్ :
2002 డిసెంబర్ లో 8 కోట్ల బడ్జెట్ తో సినిమా స్టార్ట్ అయ్యింది. బ్యాక్ డ్రాప్ స్టోరీ కోసం కేరళను ఎంచుకున్నారు. ఈ సినిమాలో అంకిత చేసిన పాత్రను మొదట ఆర్తి అగర్వాల్ తో చేయిద్దామనుకున్నారు కానీ అప్పటికే వసంతం సినిమా షూటింగ్ లో ఆర్తి బిజీగా ఉండడంతో అంకితను ఫిక్స్ చేసుకున్నారు. మ్యూజిక్ కీరవాణికి అప్పజెప్పాడు రాజమౌళి.
రిలీజ్ :
2003 జులై 9 న150 ప్రింట్లతో విడుదలైంది సింహాద్రి …అప్పటి వరకు అన్ని ప్రింట్లతో రిలీజైన చిత్రమిదే. 14 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
మొదటి ఆట: వరుసగా రెండు సినిమాలు పోయినా….జనాలు థియేటర్లకు ఎగబడి వచ్చారు. NTR యాక్టింగ్ కు ఫిదా అయిపోయారు. అదిరిపోయే ఇంటర్వెల్ బ్యాంగ్, గూస్ బమ్స్ ను ఇచ్చిన క్లైమాక్స్…మధ్యమధ్యలో పాటలకు NTR అదిరిపోయే స్టెప్పులు….ప్రేక్షకులు సినిమాకు కనెక్ట్ అయిపోయారు..ఫ్యాన్స్ అయితే థియేటర్ లోనే నువ్వు విజిలేస్తే ఆంద్రా సోడా బుడ్డి అంటూ డాన్సులు వేశారు. కేరళలో సింగమలై…. ఆంద్రాలో సింహాద్రి ఓ నినాదంగా మారింది.
రికార్డులు:
- 8 కోట్ల బడ్జెట్ తో రిలీజైన ఈ సినిమా 25 కోట్లను కలెక్ట్ చేసింది.
- 180 సెంటర్లలో 50 రోజులు
- 150 సెంటర్లలో డైరెక్ట్ గా 100 రోజులు
- 55 సెంటర్ లలో 175 ఆడి ఇండియా రికార్డ్ ను సాధించింది.
Advertisements
హైలెట్స్:
- ఈ సినిమా చేసినప్పుడు NTR వయస్సు 20 ఏళ్ళు
- ఇంత డెప్త్ స్టోరీని NTR లీడ్ చేస్తాడా? అనే డౌట్ రైటర్ విజయేంద్రప్రసాద్ కు రాగా NTR గురించి తెలిసిన రాజమౌళి యస్ అని చెప్పాడట
- ఇదే సినిమాను తమిళంలో గజేంద్రగా, కన్నడలో కంఠీరవగా రిమేక్ చేశారు.
- భూమిక పొడిచినప్పుడు , క్లైమాక్స్ సీన్ లో NTR నటన పీక్స్.