Advertisement
వివాహం,విడాకులు, రెండవ పెళ్లి అనేది సిని పరిశ్రమలో సహజం..పరిశ్రమలో ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారంటే ఎన్నాళ్లు కలిసుంటారో అనే కామెంట్స్ వినిపిస్తూనే ఉంటాయి.బాలివుడ్ తో పోలిస్తే మిగతా పరిశ్రమలు కొంత బెటర్ అని చెప్పొచ్చు..మన తెలుగు పరిశ్రమలో నాటి ఎన్టీయార్ మొదలుకొని పవన్ కళ్యాణ్ వరకు రెండవ పెళ్లి చేసుకున్నవారున్నారు..టాలివుడ్లో సెకండ్ మ్యారేజ్, ఆపైన పెళ్లిల్లు చేసుకున్న నటులు ఎవరు? ఎవరిని చేసుకున్నారు??
నందమూరి తారకరామారావు
ఇరవై ఏళ్ల వయసులో మేనమామ కూతురు బసవతారకం ని వివాహం చేసుకున్నారు ఎన్టీయార్..వారికి 8మంది కొడుకులు,4కూతుర్లు..1985లో బసవతారకం క్యాన్సర్ తో మరణించారు..రాజకీయాల్లోకి ప్రవేశించాక లక్ష్మీ పార్వతి పరిచయం కావడంతో ఆమెను 1993లో పెళ్లి చేసుకున్నారు.అప్పుడు NTR వయసు 70ఏళ్లు.
కృష్ణ
Advertisements
విజయనిర్మలను పెళ్లిచేసుకునే టైంకి కృష్ణకి ఇందిరాదేవితో వివాహం జరిగి ముగ్గురు పిల్లలున్నారు.. వీళ్లిద్దరూ కలిసి నటించిన మొదటి సినిమా సాక్షి.ఆ సినిమా టైంలో ఏర్పడిన పరిచయం,ప్రేమ పెళ్లికి దారి తీసింది..అప్పటికే విజయనిర్మలకు పెళ్లి అయి ఒక కొడుకు ఉన్నాడు..యాక్టర్ సీనియర్ నరేష్ విజయనిర్మల కొడుకే..
కృష్ణం రాజు
కృష్ణం రాజు మొదటి భార్య పేరు సీతాదేవి, ఒక కార్ యాక్సిడెంట్లో ఆమె మరణించింది.వారికి ఒక కూతురు. తర్వాత శ్యామల దేవిని వివాహం చేసుకున్నారు..వీరికి ముగ్గురు కూతుర్లు..వీరితో పాటు ఒక కూతుర్ని దత్తత తీసుకున్నారు కృష్ణంరాజు దంపతులు.. కృష్ణం రాజు నటవారసుడిగా తన తమ్ముడికొడుకు ప్రభాస్ సినిమాల్లోకి వచ్చారు.
పవన్ కళ్యాణ్
పవన్ మొదటి భార్య పేరు నందిని.ఇది పెద్దలు కుదిర్చిన వివాహం.తర్వాత రేణు దేశాయ్ తో సహజీవనం..2007లో నందినికి విడాకులు ఇచ్చి, రేణుని 2009లో వివాహం చేసుకున్నాడు పవన్.. వీరిద్దరూ 2012 లో విడిపోయారు..తీన్మార్ సినిమా షూట్ టైంలో పరిచయం అయిన రష్యన్ నటి అన్నా లెజినోవాను మూడో పెళ్లి చేసుకున్నాడు.
కమలహాసన్
విలక్షణ నటుడు కమలహాసన్ మొదటి భార్య పేరు వాణి గణపతి..ఆమెకి విడాకులిచ్చి సారికను వివాహం చేసుకున్నాడు..వీరిద్దరి పిల్లలే శృతిహాసన్,అక్షరాహాసన్..తర్వాత సారికతో తెగతెంపులు చేసుకుని గౌతమితో సహజీవనం చేసాడు..ప్రస్తుతం వీరిద్దరూ వేరుగా ఉంటున్నారు..నటి పూజాకుమార్ తో సహజీవనం చేస్తున్నాడని టాక్.
నాగార్జున
Advertisement
సినిమాల్లోకి ఎంటర్ కావడానికి ముందే నాగార్జున వివాహం దగ్గుబాటి లక్ష్మితో జరిగింది…వివాహం తర్వాత నాగ్ సినిమాల్లోకి రావడం..ఇద్దరి అభిప్రాయాలు కుదరక విడిపోవడం జరిగింది..అప్పటికే వారికి నాగచైతన్య పుట్టాడు..తర్వాత నాగ్ అమల పరిచయం కావడం,ప్రేమ పెళ్లి..దాంతో అమల సినిమాలు వదిలేసి యానిమల్ యాక్టివిస్ట్ గా స్థిరపడింది..వీరి కుమారుడు అఖిల్.. చైతన్య, సమంతల పెళ్లి లక్ష్మి,నాగార్జున కలిసే జరిపించారు.
మోహన్ బాబు
మంచు విద్యాదేవి మోహన్ బాబు మొదటి భార్య..వీరిద్దరికి పుట్టిన పిల్లలే విష్ణు,మంచు లక్ష్మి.. మొదటి భార్య మరణాంతరం విద్యాదేవి చెల్లెలు నిర్మలాదేవిని పెళ్లి చేసుకున్నారు మోహన్ బాబు..వీరికి మంచు మనోజ్ జన్మించాడు.
ప్రకాశ్ రాజ్
ప్రకాశ్ రాజ్ మొదటి భార్య లలిత కుమారి,వీరికి ఇద్దరమ్మాయిలు.ఆమెతో విడాకులనంతరం పోనివర్మను వివాహం చేసుకున్నాడు వీరికొక బాబు..ప్రస్తుతం తండ్రికొడుకుల ఫోటోలు,వీడియో సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి… లలిత,డిస్కోశాంతి ఇద్దరు అక్కాచెల్లెల్లు.. శ్రీహరి,ప్రకాశ్ రాజ్ తోడళ్లుల్లు అన్నమాట..
చలం
“తండ్రులు కొడుకులు” సినిమాలో కలిసి నటించిన చలం,శారద ప్రేమలో పడి వివాహంచేసుకున్నరు.. శారద తొలిచిత్రం కూడా అదే….అప్పటికే చలం పెళ్లి అయి భార్య చనిపోయింది..తర్వాత కొన్నాళ్లకు ఈ జంట విడిపోయింది. శారద నటనా జీవితం కొనసాగించింది.
శరత్ బాబు
8సార్లు నందిఅవార్డు అందుకున్న నటుడు శరత్ బాబు..ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషించిన ఈయన మొదట రమాప్రభని వివాహం చేసుకున్నారు..వీరి రిలేషన్ విషయంలో అనేక వివాదాలు చోటుచేసుకున్నాయి..రమాప్రభతో విడాకుల అనంతరం స్నేహలతను పెళ్లి చేసుకున్న ఆయన,తర్వాత ఆమెకి విడాకులిచ్చి ఒక జర్నలిస్ట్ ని వివాహం చేసుకున్నారు.
రామకృష్ణ
యుక్త వయసులో వివాహం అయిన రామకృష్ణ నటి గీతాంజలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు..వీరిద్దరూ చాలా కాలం అన్యోన్యంగా జీవించారు వీరి ప్రేమకు గుర్తుగా వీరికొక బాబు పుట్టాడు..రామకృష్ణ మరణాంతరం గీతాంజలి మానసికంగా కృంగిపోయారు.
Advertisements