Advertisement
ఒక్క మాట….ఒకే ఒక్కమాట….కొంతమంది సినీ తారల కెరీర్ ను తలకిందులు చేసేసింది. కోపంతోనో, గర్వంతోనో, ఓవర్ కాన్ఫిడెన్స్ తోనో….కొంతమంది చేసిన వ్యాఖ్యలు వారి వారి సినీ కెరీర్ పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి.! అలా మాట జారి తమ సినిమా కెరీర్ ను కోల్పోయిన నటుల గురించి ఇప్పుడు చూద్దాం!
1.నర్సింహ రాజు
టాలీవుడ్ లెజెండ్స్ అందరూ ఏకమై దివి సీమ తుఫానుకై నిధులు సేకరిస్తుంటే… NTR ANR లను ఉద్దేశిస్తూ…. వాళ్లే ఇవ్వొచ్చుగా వాళ్లకేమైన డబ్బులు తక్కువా..? జనాల దగ్గర తీసుకోకపోతే….! అంటూ విమర్శించారు. ఈ మాటలు అప్పట్లో పెద్ద దుమారాన్నే లేపాయి…ఆ తర్వాత నర్సింహ రాజుకు అవకాశాలు తగ్గాయి!
2. వడివేలు
Advertisements
తమిళ్ స్టార్ కమెడియన్ వడివేలు….నోటి దురుసు కారణంగా మంచి అవకాశాలను కోల్పోయాడు. తను సినిమాల్లోకి రావడానికి కారణమైన తన బెస్ట్ ఫ్రెండ్ విజయకాంత్ ను, రాజకీయ ప్రయోజనాల కోసం జయలలితపై సిల్లీ కామెంట్స్ చేసి అవకాశాలు కోల్పోయాడు.
3. హేమ
టాలీవుడ్ మా యూనియన్ ఎలెక్షన్ లో తలెత్తిన గొడవలో బాహాటంగా స్టార్స్ ని తిట్టడం . ప్రముఖ కమిడియన్ బ్రహ్మానందం తో ఉన్న వివాదాలు . ఆవేశంగా మీడియా ముందు రాజేంద్రప్రసాద్ ని , నాగ బాబుని తిట్టడం వల్ల తనకు అవకాశాలు తగ్గాయి. ఈ విషయాన్ని హేమ బాహాటంగానే చెప్పారు.
4. జమున
Advertisement
ఒక షూటింగ్ లో అనుకోకుండా హీరో నాగేశ్వరరావు చేయి జమున భుజం మీది నుంచి పొరపాటున జారి కిందికి పడింది… కావాలనే ANR ఆ ప్రదేశంలో తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడని అందరికి చెప్పడంతో…… ANR కి కోపం వచ్చింది . దాంతో 5 సంవత్సరాలు సినిమాలే లేకుండా చేశారు అని ఆవిడే చెప్పుకున్నారు .
5. రోజ
తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ గా ఉన్నప్పుడు…. “కమల్ హాసన్ సినిమాలో ఏముంటాయి . ముద్దులు రొమాన్స్ లు తప్ప” అన్న ఓ మాట కారణంగా రోజ తమిళ్ స్టార్ హీరోలతో యాక్ట్ చేసే అవకాశాన్ని కోల్పోయారు. ముఖ్యంగా కమల్, రజినీకాంత్ సినిమాల్లో అవకాశాలు కోల్పోయారు.!
6. కోవై సరళ
“ఇంత టాలెంట్ ఉన్నా…. ఆడదాన్ని ఎదగనివ్వదు ఈ తమిళ ఇండస్ట్రీ” అని కోవై సరళ చేసిన కామెంట్ ఆమెకు తమిళ్ ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా చేసింది. అదే సమయంలో తెలుగులో అవకాశాలు రావడంతో కోలుకుంది.
7. వాణి శ్రీ
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా…. స్కిట్ లో భాగంగా అప్పుడే రిలీజ్ అయిన కృష్ణ దేవదాస్ సినిమాపై సెటైర్ వేయడంతో …. . విజయ నిర్మలకు కోపం వచ్చింది . దాంతో అప్పటి నుండి కృష్ణ సినిమాలో అవకాశాలను కోల్పోయింది.
Advertisements