Advertisement
భారతీయ రైల్వే ప్రయాణికులు త్వరలో అతి సుఖమైన ప్రయాణం చేయబోతున్నారా ? అసలు ప్రయాణ బడలిక అంటూ లేని ప్రయాణాన్ని వారు అనుభూతి చెందనున్నారా ? అంటే అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే కింద ఇచ్చిన వీడియో చూస్తే మీరు కూడా అదే అంటారు. కదులుతున్న రైలులో ఓ కంపార్ట్‌మెంట్‌లోని టేబుల్ మీద పూర్తిగా నీటితో నిండిన ఓ గ్లాస్ ను పెడితే ఏమవుతుంది ? అందులో ఉండే నీరు దొర్లిపోతుంది కదా.. అయితే ఈ వీడియో చూస్తే ఆ విషయం తప్పని మీరే అంటారు.
బెంగళూరు నుంచి మైసూరు వెళ్లే మార్గంలో ఓ రైలులో తీసిందే ఆ వీడియో. అందులో ఓ కంపార్ట్‌మెంట్‌లో టేబుల్ మీద పూర్తిగా నీటితో నిండిన గ్లాస్‌ను ఉంచారు. రైలు అత్యధిక వేగంతో వెళ్తున్నా ఆ గ్లాస్‌లో ఉన్న నీటిలోంచి కనీసం ఒక్క చుక్క నీరు కూడా కింద పడలేదు. ఈ క్రమంలోనే ఆ సమయంలో తీసిన ఆ వీడియోను సాక్షాత్తూ రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Advertisement
The results of intensive track ?️ maintenance carried out between Bengaluru & Mysuru in Karanataka are there for everyone to see.
The journey has become so smooth that not even a single drop of water ? spilled out of the glass while the train was traveling at high speed. pic.twitter.com/r7aFp55gSA
Advertisements
— Piyush Goyal (@PiyushGoyal) October 30, 2020
Advertisements
కాగా బెంగళూరు – మైసూరు నడుమ గత 6 నెలలుగా సుమారుగా 130 కిలోమీటర్ల పొడవున రైలు మార్గాన్ని ఆధునీకరించారు. అందుకు రూ.40 కోట్ల ఖర్చయింది. కంకర రాళ్లను పోయడం, ట్రాక్స్ కు మరమ్మత్తులు చేపట్టడం, దృఢత్వాన్ని పెంచడం వంటి పనులు చేశారు. దీంతో రైల్వే ట్రాక్ అద్భుతంగా మారింది. ఈ క్రమంలో దానిపై ఆ రైలు అత్యధిక వేగంతో వెళ్లింది. ఆ సమయంలో అందులో అలా ఓ టేబుల్ మీద గ్లాస్ ఉంచి టెస్ట్ చేశారు. ఫలితంగా అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అనుభూతి చెందేందుకు వీలు కలిగింది. అయితే దేశంలోని రైలు మార్గాలన్నింటినీ ఈ విధంగానే మారుస్తారా, లేదా అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.