Advertisement
ఒక సినిమా నచ్చాలంటే పాటలు, మాటలు ఫైట్లు అన్ని ఫర్ఫెక్ట్ గా ఉండాలి.. కొన్ని సినిమాలు పాటలు బాగుంటే కథ బాగోదు.. కొన్నింటికి కథ బాగుంటే పాటలు సోసోగా ఉంటాయి..ఒకట్రెండు పాటలే సినిమాను ప్రేక్షకులు ఆకట్టుకునేలా చేసిన సినిమాలున్నాయి.. సినిమా హిట్ ,ఫట్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకుని, సినిమా చూసేలా చేసిన కొన్ని పాటలు..
Watch Videos :
నేను మీకు తెలుసా? – ఎన్నొ ఎన్నో ఎన్నెన్నో..ఎన్నెన్నో.. ఏమో ఏమో..
పాటేంటో తెలియకుండానే పల్లవిని హమ్ చేసి ఎంజాయ్ చేసిన పాట ఇది.. రాత్రి పూర్తిగా నిదరేలేదు..వేళ దాటినా ఆకలి కాదు… లైన్స్ సూపర్ హిట్.. 2008 లో సూపర్ హిట్ సాంగ్స్ లిస్ట్లో ఈ పాట ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే.. మనోజ్ ,స్నేహఉల్లాల్ ప్రధాన పాత్రలుగా వచ్చిన నేను మీకు తెలుసా సినిమాలో ఈ పాట సూపర్ డూపర్ హిట్ గా నిలిచి సినిమా హిట్ లో ప్రధాన పాత్ర పోషించింది..
Advertisements
Rx 100 – పిల్లా రా
Rx 100 సినిమా హిట్లో ఎక్కువ శాతం ఈ పాటకే దక్కుతుంది.. ఈ ఒక్క పాట సినిమావైపు ప్రేక్షకులు అట్రాక్ట్ అయ్యేలా చేసింది.. డిఫరెంట్ స్టోరీతో ఉన్న సినిమాను హిట్ చేసింది..డైరెక్టర్,హీరో, హీరోయిన్లకు పేరు తెచ్చిపెట్టింది.
రణం – బుల్లి గౌను వేసుకుని
గోపిచంద్, కామ్నా జెఠ్మాలని హీరోహీరోయిన్లుగా నటించిన రణం సినిమాలో బుల్లిగౌను వేసుకుని పాట సూపర్ డూపర్ హిట్.. ఈ పాటలో గోపిచంద్ కి ఆలి ప్రేమ పాఠాలు బోధిస్తుంటాడు..
ఐతే – చిటపట చినుకులు అరచేతుల్లో ముత్యాలైతే..ఐతే..
కళ్యాణి మాలిక్ సంగీత దర్శకత్వం వహించిన ఐతే సినిమాలో చిటపట చినుకులు అరచేతుల్లో ముత్యాలైతే ..ఐతే.. అడ్డు చెప్పదే అంబ్రెల్లా ఎప్పుడూ..
గోపి గోపిక గోదావరి – నువ్విక్కడుంటే నేనక్కడుంటే ప్రాణం విల విల..
వేణు, కమలిణి ముఖర్జి నటినటులుగా వంశీ దర్శకత్వంలో వచ్చిన గోపి గోపిక గోదావరి సినిమాలో నువ్విక్కడుంటే నేనక్కడుంటే ప్రాణం విల విల పాట సినిమా చూడ్డానికి ప్రేక్షకులు థియేటర్ కి క్యూ కట్టేలా చేసింది..
సెగ- వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ..
Advertisement
నాని,నిత్యామీనన్ నటించిన తమిళ సినిమా వెప్పం..తెలుగులో సెగ గా రిలీజైంది..సినిమా అంతంతమాత్రంగానే ఆడినా వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ పాట హిట్ అయింది.. ఈ సినిమాలో స్నేహితుల మధ్య వచ్చే పాదం విడిచి ఎటు పోయొను భువనం పాట కూడా సూపర్ హిట్ అయింది.
కౌసల్య కృష్ణ మూర్తి – ముద్దబంతి పూవు ఇలా పైట వేసేనే..
ఇటీవల ఎక్కడ చూసినా ఈ పాటే వినపడేది.. ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రలో వచ్చిన కౌసల్యా క్రిష్ణమూర్తి సినిమాలో ముద్ద బంతి పూవు ఇలా పైట వేసేనే పాట సినిమా హిట్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
గుణ 369- నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం..
కార్తికేయ తొలిచిత్రం Rx 100 సూపర్ హిట్ కాగా.. గుణ 369 యావరేజ్ హిట్ గా నిలిచింది..ఈ సినిమాలో నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం.. సూపర్ హిట్ అయి సినిమా వైపు అట్రాక్ట్ అయ్యేలా చేసింది..
నా ఆటోగ్రాఫ్ – మౌనంగానే ఎదగమని..
తమిళంలో హిట్ అయిన నా ఆటోగ్రాఫ్ తెలుగులో అంత పేరు తెచ్చుకోనప్పటికి రవితేజ కెరీర్లో డిఫరెంట్ మూవిగా నిలిచిపోయింది..సినిమాలో పాటలన్ని బాగున్నప్పటికి “మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెప్పింది” ఇన్సిపిరేషనల్ సాంగ్ సినిమాలో రవితేజని ఇన్స్పైర్ చేయడమే కాదు, ప్రేక్షకులు సినిమా చూసేలా చేసింది.
పైసా – నీతో ఏదో చెప్పాలని ఉందే..
నీతో ఏదో చెప్పాలని ఉందే… నాని,కేథరిన్ జంటగా వచ్చిన పైసా సినిమాలో ఈ పాట కోసం సినిమా కెలితే పాట తప్ప సినిమా అంత తలనొప్పి అనే ఫీలింగ్ వస్తుంది..పేరులో పైసా ఉంది కానీ ప్రొడ్యుసర్ కి పైసలు మిగల్చలేదు ఈ సినిమా..పాట మాత్రం హిట్..
శ్రీరామ్ – తియతియని కలలను కనడమే తెలుసు
ఉదయ్ కిరణ్, అనిత కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రం శ్రీరామ్.. ఈ సినిమాలో రొమాంటిక్ సాంగ్ తియతియని కలలను కనడమే తెలుసు పాట కోసమైనా ప్రేమికులు సినిమా చూసేవారు..
రాజు భాయ్ – ఎవ్వరు నువ్వో నను కదిపావో…
ఎవ్వరు నువ్వో నన్ను కదిపావో.. ప్రేమికుల ఆల్ టైమ్ ఫేవరెట్..రాజు భాయ్ సినిమాలో ఈ పాటకి స్టెప్పులేసిన ప్రియులు ఎందరో..మనోజ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ సాంగ్.
ఓ రంగుల చిలుక
జయమ్ము నిశ్చయమ్ము రా సినిమాలోని ఓ రంగుల చిలుక పాట కూడా… సినిమా విడుదలకు ముందే జనాల్ని బాగా ఆకట్టుకుంది. కేవలం ఈ పాట కోసం సినిమాకు వెళ్లిన వారు చాలానే ఉన్నారు!
Advertisements