Advertisement
మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలి. ముంబాయి లో నివాసం! నాకు 13 ఏళ్ల వయస్సప్పుడు..మా అమ్మ తనతోపాటు నన్ను మార్కెట్ కు తీసుకెళ్లింది! అక్కడ రోడ్డు పక్కన ఫుట్ పాత్ పై బ్రాలు, డ్రాయర్లు అమ్ముకుంటున్న వ్యక్తి దగ్గరకు వెళ్లి…. నాకూతురికి మంచి బ్రాలు ఇవ్వమని అడిగింది…అతను నా ఎదవైపు చూసి…ఈ సైజు వస్తుందని తెల్ల కలర్ లోని బ్రాలను ఇచ్చాడు. రేట్ ను బేరమాడి..కాస్త తగ్గించి రెండు జతలు తీసుకుంది అమ్మ!
Advertisement
వాటిని అమ్మే వ్యక్తి వయస్సు 25 నుండి 30 లోపు …ఉంటుంది! సాధారణంగా ఎవరైనా మన ఎదవైపు అలా చూస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుందో అంతే ఇబ్బందికి గురయ్యాను అప్పుడు !
Advertisements
వాటిని వాడిన మరుసటి రోజు ….ఉతికి దండెం మీద ఆరేశాను.! అమ్మ పిలిచింది. వాటిని అలా ఆరేయ్యొద్దు… పెద్ద పెద్ద బట్టల కింద ఆరేయాలి, పక్క వాళ్లు చూస్తే బాగోదు…అందుకే అవి కనిపించేలా ఎప్పుడూ ఆరేయొద్దు అని చెప్పింది! అప్పుడు నేను మా అమ్మను ఒకే ప్రశ్న అడిగాను…షాప్ వాడు నా ఎదభాగం వైపు చూసి ఈ సైజ్ వస్తుంది అని చెప్పినప్పుడు లేని ఇబ్బంది….ఆరేసిన వాటిని ఎవరో చూస్తే ఎందుకు అమ్మా.? అని….అమ్మ నవ్వింది… తర్వాత నీకే అర్థమౌతుందిలే అని చెప్పింది! ఇప్పుడు నా వయస్సు 30 …. ఇప్పటికీ మా అమ్మ అలా ఎందుకందో నాకైతే అర్థంకాలేదు.!
Advertisements