Advertisement
ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ యాప్ బైజూస్ మన దేశంలో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. విద్యార్థులకు ఇందులో వినూత్న రీతిలో పాఠ్యాంశాలను బోధిస్తుంటారు. ప్రముఖ నటులు షారూక్ ఖాన్, మహేష్ బాబులు దీనికి బ్రాండ్ అంబాసిడర్‌లుగా ఉన్నారు. అయితే బైజూస్ యాప్ ఓనర్ ఎవరో తెలుసా ? ఆయన పేరు బైజు రవీంద్రన్. ఈ యాప్ ద్వారా ఆయన ఏకంగా భారతదేశంలో యువ బిలియనీర్‌గా రికార్డు సృష్టించాడు.
బైజు రవీంద్రన్ 2003లో ఇంజినీరింగ్ పూర్తి చేయగా, విద్యార్థులకు గణితంలో పాఠాలను బోధించడం మొదలు పెట్టాడు. అయితే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (క్యాట్)లో అతను 100 శాతం స్కోరును కూడా సాధించాడు. కానీ తరువాత 2 ఏళ్లకు పూర్తి స్థాయిలో టీచింగ్ వృత్తిలోకి అడుగు పెట్టాడు. అదే సమయంలో దివ్య గోకుల్‌నాథ్ అతనికి పరిచయం అయింది. ఆమె రవీంద్రన్ వద్ద గణిత పాఠాల కోసం వచ్చేది. కానీ వారి మధ్య స్నేహం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. తరువాత వారు వివాహం చేసుకుని 2015లో బైజూస్ యాప్‌ను లాంచ్ చేశారు. ఈ క్రమంలో దివ్య ఆ కంపెనీలో బోర్డు మెంబర్‌గా కొనసాగుతోంది.
Advertisement
Advertisements
ఇక బైజూస్ యాప్‌కు ప్రారంభించినప్పటి నుంచి విపరీతమైన ఆదరణ లభించింది. ఆన్‌లైన్‌లో చాలా సులభంగా పాఠ్యాంశాలను నేర్చుకునే వీలు ఉండడంతో దీనికి చాలా మంది పిల్లలు అలవాటు పడ్డారు. ఈ క్రమంలోనే ఈ యాప్ దిన దినాభివృద్దిని సాధించింది. ఇందులో 3 కోట్ల మంది విద్యార్థులు పాఠాలు నేర్చుకుంటున్నారు. ఈ యాప్ ఇప్పటి వరకు 6.4 కోట్ల డౌన్‌లోడ్స్‌ను పూర్తి చేసుకుంది. ఈ కంపెనీ విలువ ప్రస్తుతం 3.05 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే దాదాపుగా రూ.22.3 వేల కోట్లు అన్నమాట. దీంతో రవీంద్రన్ ఇండియాలోనే అత్యంత పిన్న వయస్కుడైన బిలియనీర్‌గా రికార్డు సృష్టించాడు.
Advertisements
బైజూస్ కంపెనీలో ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, టెన్సెంట్, టైగర్ గ్లోబల్ వంటి పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. 2019లో ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో 1.9 బిలియన్ డాలర్ల సంపదతో రవీంద్రన్ చోటు సంపాదించాడు. 2020 జాబితాలో 46వ ర్యాంక్‌లో నిలిచాడు.