Advertisement
ఈ ఫోటో పాకిస్థాన్ కు చెందిన PK-8303 అనే విమానం కూలిపోడానికి ఒక రోజు ముందు దిగింది. ఈ ఫోటోను గమనిస్తే మద్యలో ఉన్నామె ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె ఈ కూలిపోయిన విమానంలో ఎయిర్ హోస్టెస్ ..ఈ విమాన ప్రమాదంలో మరణించిన వారిలో ఆమె కూడా ఉన్నారు.
Advertisements
Advertisement
ఒక రోజు ముందే ఆమెకు ఈ విమానంలో డ్యూటీ చేయాల్సుంటుందనే విషయం తెలిసిందట.! అయితే తాను తన గ్రూమింగ్ ఆఫీసర్ తో ….”ప్రస్తుతం ఉన్న కొరొనా సమయంలో నేను ఈ డ్యూటీకి రావాలనుకోలేదు… నాకిద్దరు చిన్న పిల్లలున్నారు.. అనుకోనిది ఏదైనా జరిగితే ….వాళ్ల భవిష్యత్తే ప్రశ్నార్థకమవుతుంద”ని చెప్పిందట.! “కానీ తప్పదు కదా…అందుకే రావాల్సి వచ్చింద”ని చెప్పిందట…తర్వాత వాళ్లంతా కలిసి ఈ ఫోటో దిగారట.! అదే మూడ్ లో ఫోటో దిగడంతో … ఎయిర్ హోస్టెస్ ముఖంలో ఇలా భయం కనిపించింది.
మరికొద్ది సేపట్లో..మనం కరాచీ జిన్నా ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అవ్వబోతున్నాం అని పైలట్ ప్రకటించిన కొద్ది నిమిషాల్లోనే ఈ ఘటన జరిగింది. ఈ విమాన ప్రమాదంలో 97 మంది ప్రయాణికులతో పాటు 8 మంది సిబ్బంది అక్కడిక్కడే మరణించారు. ఇద్దరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు.
Advertisements