Advertisement
మన దాయాది పాకిస్థానీయులు మంచి తిండి ప్రియులు….వారి ఆహారంలో ఎక్కువగా నాన్ వెజ్ ను ఉండేలా చూసుకుంటారు. ఇక టీ విషయానికి వస్తే….దూద్ -పత్తి అనే పేర నీళ్లు కలపని టీ ని తాగడానికి ఎక్కువగా ఇష్టపడతారు.! ఇంకా వాళ్లు ఇష్టంగా తినే ఆహార పదార్థాలేవో చూద్దాం!
నహరి….
డ్రైప్ర్యూట్స్, నెయ్యి, ఫ్యాట్…. బొక్కలున్న మటన్ ముక్కలతో చేసే వంటకం…. చపాతీ, పరోటాలకు మంచి కాంబినేషన్…బ్రేక్ ఫాస్ట్ గా చాలా మంది ఇష్టపడే వంటకం….లాహోర్ లోని వారిస్ నహారి ప్రపంచ ప్రసిద్ధి పొందింది!
కాబూలీ పలావ్
కాబూల్ ఆఫ్ఘనిస్తాన్ రాజధాని అయినప్పటికీ…ఆ పేర వంటకం పాకిస్థాన్ లో చాలా ఫేమస్, కుంకమపువ్వు ప్లేవర్ తో దాల్చిన చెక్క టేస్ట్ తో బిర్యానీని పోలి ఉండే ఈ వంటకం టేస్ట్ అదిరిపోతుందట! పెషావర్ కాబూలీ పలావ్ మస్త్ ఫేమస్ .!
Advertisements
హల్వా పూరీ.
పాకిస్తానీల ఫేవరెట్ బ్రేక్ ఫాస్ట్ ఇది! రెండు పూరీలు తింటే చాలు సాయంత్రం వరకు పొట్ట ఫుల్ ఉంటుంది! స్వీట్ తో బ్రేక్ ఫాస్ట్ చెయ్యడం ఇండియాలోని ఉత్తర ప్రదేశ్ లో కూడా ఉంటుంది!
సజ్జి
తందూరీ స్టైల్ చికెన్ ను అక్కడ సజ్జి అంటారు.! దోస్త్ లతో కలిసి స్నాక్స్ టైమ్ లో ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు.!
Advertisement
కటాకట్
మేక కిడ్నీలు, గుండె, కపూరలతో చేసే వంటకమే ఇది! రోటీతో ది బెస్ట్ కాంబినేషన్ గా తింటుంటారు పాకిస్తానీయులు!
బన్ కబాబ్
కరాచీ స్ట్రీట్ ఫుడ్ లో టాప్ మోస్ట్ సేల్ ఐటమ్ ఇది. ముంబాయిలో వడాపావ్ ఎంత ఫేమస్సో….ఇక్కడ బన్ కబాబ్ అంతే ఫేమస్! చాలా మందికి బన్ కబాబ్ చేసి అమ్ముకోవడం జీవనాధరం ఇక్కడ!
పరాటా
పరాటాలను పాకిస్తాన్ లో చాలా వెరైటీలలో చేస్తారు. బ్రేక్ ఫాస్ట్ దీనిని డిఫరెంట్ కాంబినేషన్లలో కలిపి వడ్డిస్తుంటారు!
లస్సీ
పాల ఉత్పత్తులు ఎక్కువ కాబట్టి పాకిస్తాన్ లో పాలతో తయారు చేసే ప్రతి వస్తువు వినియోగం ఎక్కువగా ఉంటుంది. కాలాలతో సంబంధం లేకుండా అక్కడ లస్సీ షాప్ లు నడుస్తూనే ఉంటాయి. లస్సీలోనే కొన్ని కొత్త కొత్త ఫ్లేవర్స్ యాడ్ చేసి అమ్ముంతుంటారు.
Advertisements