Advertisement
రాజకీయ నాయకులు చూసేందుకు పైకి చాలా గంభీరంగా ఉంటారు. కానీ నిజానికి వారిలోనూ హాస్యం, చతురత ఉంటాయి. అవి కేవలం అప్పుడప్పుడు మాత్రమే బయట పడుతుంటాయి. అందుకు పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టోయే ఉదాహరణ. అది 1977వ సంవత్సరం. అప్పట్లో బెనజీర్ భుట్టో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్‌లో కోశాధికారిగా ఉన్నారు. ప్రముఖ జర్నలిస్టు కరన్ థాపర్ కూడా ఆమెకు సమకాలీకుడే. ఆయన అప్పట్లో కేంబ్రిడ్జి యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్‌లో ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.
Advertisement
అయితే ఒక రోజు సరదాగా అక్కడి స్టూడెంట్ల ఓ డిబేట్ నడిచింది. బెనజీర్ భుట్టో.. దిస్ హౌజ్ వుడ్ హావ్ సెక్స్ బిఫోర్ మ్యారేజ్.. అని ఒక తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నానని అన్నారు. ఇందుకు విద్యార్థులందరూ షాక్ అయ్యారు. అయితే అప్పట్లో బెనజీర్ భుట్టో తండ్రి జుల్ఫికర్ అలీ భుట్టో పాక్ ప్రధానిగా ఉన్నారు. అందువల్ల ఆ టాపిక్‌పై మాట్లాడేందుకు నిజానికి ఎవరికీ ధైర్యం చాలలేదు. అయితే కరన్ థాపర్ కల్పించుకుని.. మేడమ్ మీరు పెళ్లికి ముందే సెక్స్ చేయమని ప్రపోజ్ చేస్తున్నారు ? మీరనే మాటలను మీరు పాటిస్తారా ? అని అడిగాడు.
అయితే అందుకు బెనజీర్ భుట్టో తడుముకోకుండా సమాధానం చెప్పారు. అవును.. నేనన్న మాటలను నేను అనుసరిస్తాను. కానీ మీతో మాత్రం అలా చేయలేను.. అని అన్నారు. దీంతో అక్కడంతా నవ్వుల సందడి నెలకొంది. అందరూ ఆమె అన్న మాటలకు చప్పట్లు కొట్టారు. ఆమె అంతటి ధైర్యం, సమయస్ఫూర్తి ఉన్నాయి కాబట్టే ప్రధానిగా కొనసాగారు.
Advertisements