Advertisement
ఇద్దరు విదేశీయులు ఇండియా చూడడానికి వచ్చి, తమ మూలాలు ఇక్కడే ఉన్నాయని తెలుసుకొని…… తమ తాతలు బతికిన భూమి మీదే బతకాలని డిసైడ్ అయ్యి ఇక్కడే ఓ పాన్ డబ్బా పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు.! అంటూ కింది ఫోటోలను చూపుతూ వైరల్ అవుతున్న వార్త.! – ఇది ఫేక్!
మరి నిజమేంటి?
జోహన్, హంపస్ అనే ఈ ఇద్దరూ ….స్వీడన్ కు చెందిన వాళ్లు. 2015లో తమ డిగ్రీలు కంప్లీట్ చేసుకున్నాక…హింది సినీ ఇండస్ట్రీలో యాక్ట్ చేయాలని ఇండియాకు వచ్చారు. ఇదే క్రమంలో ముంబాయిలో వాళ్లకు విధాన్ ప్రతాప్ సింగ్ పరిచయమయ్యాడు. వీరు ముగ్గురు గ్రూప్ గా కలిసి కామెడీ వీడియోస్ చేస్తూ జనాల్ని ఎంటర్ టైన్మెంట్ చేయడం ప్రారంభించారు. 2 Foreigners In Bollywood అనే ఓ ఫేస్ బుక్ పేజ్ ను క్రియేట్ చేసి తాము చేసిన వీడియోను అందులో ఉంచేవారు. వీరి వీడియోస్ ను మెచ్చి చాలా మంది వీరిని సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు.ఈక్రమంలో వీరు మంచి హిందీ కూడా నేర్చుకున్నారు. ఇక్కడి సాంప్రదాయాలతో పాటు ఇక్కడి వింతలపై వీడియోస్ చేస్తుంటారు!
Advertisement
Advertisements
Advertisements