Advertisement
వ్యాపారం పేర వచ్చి… మనల్ని అన్నివిధాలుగా దోచుకున్నారు బ్రిటీష్ వారు. మన వాతావరణాన్ని తట్టుకున్నారు, ఇక్కడి దోమల్ని తట్టుకున్నారు, ఇక్కడి మసాలా వంటలకి అలవాటు పడ్డారు. ఇక్కడి భాషను అర్దం చేసుకున్నారు. కానీ ఇక్కడి వేడికి తట్టుకోలేక పోయారు. అందుకే మన శ్రమని వారి సౌక్యం కోసం ఇలా వాడుకున్నారు.
- ఫోటో లో మీకు కనిపిస్తున్న వారంతా పంకావాలాలు అంటే బ్రిటీష్ వారికి పంకాలు ( విసన్న కర్రలు) వీచే వారు. ఎండాకాలంలో బ్రిటీష్ ఆఫీసర్ల ఇళ్లలో , ప్రభుత్వ కార్యాలయాల్లో వీరు డ్యూటీ చేయాలి. రోజుకు రెండు షిప్ట్ ల పద్దతిలో ఈ పనిచేయాల్సి ఉంటుంది.
Advertisement
- పెద్ద పెద్ద తెరలకు రెండు తాళ్లను కట్టి..వాటిని వీరి చేత లాగించేవారు…వీరు తాడును అటు ఇటు లాగడం ద్వారా…ఆ తెర అటు ఇటు ఊగుతూ వారికి గాలినిచ్చేది. వాళ్లు హాయిగా లోపల విందులు వినోదాలు చేస్తూ చల్లని గాలి ఆస్వాదిస్తుంటే..వీళ్లు మాత్రం..ఇలా తమ రెక్కలను ముక్కలు చేసుకోవాల్సి వచ్చేది. ఇంత కష్టపడ్డా వీరికి నామమాత్రపు జీతమే లభించేది.
- చెవిటి వారికే ప్రాధాన్యం- పంకావాల ను తీసుకునే ముందు చెవిటి వారికే ప్రాధాన్యతనిచ్చేవారు..ఎందుకంటే తమ రహస్యాలను వీరైతే వినలేరు, ఇతరులకు చెప్పలేరు కాబట్టి.
- కొంత మంది బ్రిటీష్ అధికారులు…వేశ్యలతో కులికే సమయంలో కూడా పంకావాలాలను బయట ఉండి…ఆ పంకా తాడును లాగాల్సిందే!
Advertisements
- పంకావాలాలు..రాత్రంతా …తాళ్లు లాగి లాగి ఒక్కోసారి సొమ్మసిల్లి పడిపోయేవారు.
Also Read : కుక్కలకు మరియు భారతీయులకు ప్రవేశం లేదు…. ఈ బోర్డ్ చూడగానే బ్రిటీష్ వారిపై తిరుగుబాటు చేసిన ధీరురాలు.!
Advertisements
Also Read: KGF లో ఉన్న బంగారాన్ని ఎందుకు తవ్వుకోలేక పోతున్నాం.!? అసలు KGF చరిత్రేంటి?