Advertisement
ఇక్కడున్న పేపర్ లో ఓ పెద్ద చుక్క, పక్కన చాలా చిన్న చిన్న చుక్కలున్నాయి కదా…వీటిలో పెద్ద చుక్కని కాన్సంట్రేషన్ తో అలాగే ఓ 5 నిమిషాలు పాటు చూడండి… పెద్ద చుక్కని మాత్రమే! మిగితావి పట్టించుకోవొద్దు.
ఇప్పుడు రెండు చుక్కలున్న ఈ పేపర్ లో పెద్ద చుక్కను ఓ 5 నిమిషాలు కాన్సంట్రేషన్ తో చూడండి.
ఇప్పుడు అసలు విషయానికి వొద్దాం… రెండిట్లో ఏది ఈజీ? , ఏది కష్టం? మొదటి కష్టమైన పని రెండోది ఈజీ అంతే కదా.!
Advertisements
Advertisement
పెద్ద చుక్క మన లక్ష్యం అనుకుంటే చిన్న చుక్కలు మనల్ని పక్కదారి పట్టించే చిన్న చిన్న కారణాలు, అలవాట్లు , సరదాల లాంటివి.
దీన్ని బట్టి ఏం చెప్పొచ్చంటే… లక్ష్యం మీద మన ఫోకస్ ( పెద్ద చుక్క) ఉండాలంటే… డీవియేషన్స్ ఎక్కువ ఉండొద్దు ( చిన్న చుక్కలు ) ….అప్పుడు మాత్రమే లక్ష్యాన్ని సాధించడం సులభమవుతుంది.
Advertisements
కాబట్టి…మీకున్న నెగెటివ్స్ ను పక్కకు పెట్టండి..లక్ష్యం మీద దృష్టిపెట్టండి..మీరేంటో నిరూపించుకోండి…ఎందుకంటే కాలం, వయస్సు మళ్లీ మీకోసం వెనక్కి తిరిగిరావు.!