Advertisement
లక్నో కు చెందిన రామ్ కృపాల్ ….చాలా రోజులుగా ఓ రామ చిలుకను పెంచుకుంటున్నాడు. కొన్ని రోజుల నుండి అది కనపడకపోవడంతో పక్కింటి వారిపై అనుమానమొచ్చి వారిని అడిగాడు. వారింట్లో కూడా ఓ రామచిలుక ఉంది .. మీది చూసి మేము కూడా పెంచుకోడానికి తెచ్చుకున్నాం ఇది మాది. మీ పోయిన చిలుక గురించి మాకు తెలియదు అని చెప్పడంతో …. రామ్ కృపాల్ పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేసాడు.
Advertisement
ఇద్దర్నీ పిలిపించిన పోలీస్ అధికారులు అక్బర్ – బీర్బల్ స్టైల్ లో తీర్పు చెప్పాలని ఫిక్స్ అయ్యారు. ఇద్దరు ఎదురెదురుగా నిలబడడండి ….చిలుకను ఇద్దరి ముందు వదిలేస్తాము …ఆ చిలుక ఎవరివైపు వెళ్తే వారిదే అది అని …ఇద్దరి చేత రాతపూర్వక హామీ ,సంతకాలు తీసుకొని చిలుకను వారి ముందు విడిచిపెట్టారు.
కాసేపు అటు ఇటు తిరిగిన చిలుక తుర్ మంటూ ఎగిరిపోయింది … స్వేచ్ఛగా తన తీర్పును తనే చెప్పుకుంది. నీది నాది అని కొట్టుకున్న వాళ్ళు, పోలీస్ అధికారులు అవాక్కయ్యారు.!!
Advertisements