Advertisement
పురాతన కాలం నుంచి కుక్కలు మనుషులకు స్నేహితుల్లా మెలుగుతున్నాయి. సరిగ్గా ట్రెయినింగ్ ఇవ్వాలే కానీ కుక్కలు అద్భుతంగా పనిచేస్తాయి. తమ యజమానులను ప్రమాదాల బారి నుంచి కూడా రక్షిస్తాయి. అయితే కుక్కలే కాదు, పక్షులు కూడా తమ యజమానులను కాపాడగలవు. అవును నిజమే. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే…
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ లో ఆంటన్ గుయెన్ అనే వ్యక్తి తన పెంపుడు చిలుక ఎరిక్‌తో నివాసం ఉంటున్నాడు. అయితే ఆంటన్ ఆదమరిచి తన రూంలో నిద్రపోయాడు. కానీ అదే సమయంలో అకస్మాత్తుగా అతని ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో స్మోక్ అలారంలు మోగకముందే అతని పెంపుడు చిలుక అతన్ని పేరు పెట్టి పిలుస్తూ.. ఆంటన్, ఆంటన్ అని అరిచింది. ఆ అరుపులకు నిద్ర లేచిన ఆంటన్ ఇంట్లో పొగ వాసన వస్తుందని గమనించి వెంటనే చిలుకను తీసుకుని బయటకు పరుగెత్తాడు. ఈ క్రమంలో వెంటనే ఇల్లంతా మంటలు వ్యాపించాయి.
Advertisement
అయితే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని వెంటనే మంటలను ఆర్పేశారు. కానీ ప్రమాదం ఎలా సంభవించిందో ఇప్పటికీ అంతుబట్టలేదు. అయితేనేం.. ఆంటన్‌ను మాత్రం అతని పెంపుడు చిలుక కాపాడింది. అయితే మంటలు వ్యాపిస్తున్నా స్మోక్ అలారంలు మాత్రం మోగలేదు. కానీ అతని చిలుక అలా అరవడంతో అతను బతికి పోయాడు. లేదంటే అతను ప్రాణాలను కోల్పోయి ఉండేవాడు. దీంతో అతను తన చిలుకను చూసి మురిసిపోతున్నాడు. దాని వల్లే తాను బతికిపోయానని ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.
Advertisements
ఇక వ్యక్తి ప్రాణాలను చిలుక కాపాడడం కొత్తగా, వెరైటీగా ఉండడంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Watch Video:
Advertisements