Advertisement
ఎవరైనా ఒక వ్యక్తి తన మాతృదేశం నుంచి ఇతర దేశాలకు వెళ్లాలనుకుంటే.. ముందుగా పాస్‌పోర్ట్ తీసుకోవాలన్న సంగతి తెలిసిందే. తరువాత తమ అవసరాలకు అనుగుణంగా ఆ దేశానికి చెందిన వీసా తీసుకుని అక్కడికి వెళ్తుంటారు. ఇది ఎవరైనా అనుసరించే కామన్ ప్రాక్టీస్. అయితే ఈజిప్టులో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. అక్కడి ఓ మమ్మీని మరో దేశానికి తరలించేందుకు గాను అక్కడి అధికారులు ఏకంగా దానికి పాస్‌పోర్టు ఇచ్చారు. అవును.. వింతగా లేదూ..!
ఈజిప్టులో రామెస్సెస్ 2 అనబడే మమ్మీని 1974లో ఫ్రాన్స్‌కు తరలించాల్సి వచ్చింది. ఫ్రాన్స్‌లో ఆ మమ్మీని సైంటిస్టులు పరిశోధించాలనుకున్నారు. అందుకనే ఆ మమ్మీని ఫ్రాన్స్‌కు తరలించేందుకు సిద్ధమయ్యారు. అయితే అది మమ్మీయే కానీ.. ఒక రకంగా చెప్పాలంటే.. వ్యక్తి మృతదేహం. దాన్ని తరలించాలంటే ఈజిప్టు నిబంధనలను పక్కాగా పాటించాల్సి ఉంటుంది. అక్కడి చట్టాలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో అన్ని డాక్యుమెంట్లను సిద్ధం చేసుకుని మరీ వ్యక్తులను అయినా.. మృతదేహాలను అయినా సరే.. ఈజిప్టు నుంచి మరొక దేశానికి తరలించేందుకు అవకాశం ఉంటుంది. అయితే నిజానికి ఈ ప్రక్రియ అంతా అవసరం లేదు. అయినప్పటికీ తూచా తప్పకుండా నిబంధనలను పాటించాలని చెప్పడంతో ఈజిప్టు అధికారులు చేసేది లేక ఆ మమ్మీకి పాస్‌పోర్ట్ ఏర్పాటు చేశారు.
Advertisement
అలా పాస్‌పోర్ట్ వచ్చాక దాన్ని ఈజిప్టు నుంచి ఫ్రాన్స్‌కు తరలించారు. అయితే నిజానికి ఈజిప్టు అలా చేయడం వెనుక మరొక కారణం కూడా ఉంది. ఫ్రాన్స్ గనక ఆ మమ్మీని తన వద్దే ఉంచుకునేట్లయితే.. ఈజిప్టు వారు తమ వద్ద ఎలాగూ డాక్యుమెంట్లు ఉంటాయి కనుక.. వాటిని సాక్ష్యాలుగా చూపించి మమ్మీని మళ్లీ వెనక్కి తీసుకురావచ్చు. అదీ.. ఈజిప్టు ప్లాన్.. అందుకనే అలా చేసింది. లేదంటే ఫ్రాన్స్ ఆ మమ్మీని తీసుకెళ్లాక.. వారు దాన్ని అక్కడే ఉంచేసుకుంటే.. పత్రాలు లేకపోతే ఈజిప్టు ఆ మమ్మీని నష్టపోతుంది కదా.. అందుకని ఈజిప్టు ప్రభుత్వం ఆ పనిచేసింది. ఏది ఏమైనా.. ఈ విషయం మాత్రం జనాలకు షాక్‌నిచ్చింది. అయితే చిత్రంలో చూపించింది… ఆ మమ్మీకి చెందిన అసలు పాస్‌పోర్టు కాదు.. కానీ ఈజిప్టు ప్రభుత్వం ఆ మమ్మీకి ఇచ్చిన పాస్‌పోర్టు అయితే అలాగే ఉంటుంది..!
Advertisements