Advertisement
వాస్తవానికి పీర్ల పండుగ కాదు…అవి పదిరోజుల సంతాప దినాలు.! మహ్మద్ ప్రవక్త మనవళ్లు అయిన హసన్, హుసేన్ త్యాగాలకు గుర్తుగా ఈ పదిరోజులు వారిని స్మరిస్తూ గడుపుతారు.! వారు యుద్దాల్లో వాడిన కత్తుల గుర్తులను వివిధ రూపాల్లో అలంకరించి పీరీలుగా ఆలామ్ చుట్టూ దూకుతూ ….అసై దూల అంటూ ఆడుతారు!
ఎవరీ హసన్, హుస్సేన్ ?…. ఎవరితో చేశారు యుద్దం!?
మహమ్మద్ ప్రవక్త (స) క్రీ.శ. 632లో పరమపదించిన తర్వాత…ప్రజలు ప్రజాస్వామ్య రీతిలో తమ ప్రతినిధులను ఖలీఫాల పేరుతో ఎన్నుకొనే వారు.! అలా కొనసాగుతున్న ఈ ఖలీఫా మూడో తరంలో మహమ్మద్ ప్రవక్త మనవడైన ఇమామ్ హసన్‌ను ప్రజలు ఖలీఫాగా ఎన్నుకొన్నారు.! అప్పుడు సిరియా ప్రాంత గవర్నర్ మావియా ఎలాగైనా ఖలీఫాగా తను నియామకం అవ్వాలనుకొని హసన్ మీద యుద్దాన్ని ప్రకటిస్తాడు… యుద్దం వల్ల ప్రాణనష్టం వద్దని….హసన్ స్వచ్చంధంగా తన ఖలీఫా పదవిని త్యాగం చేస్తాడు…అయినప్పటికీ హసన్ పై విష ప్రయోగం చేసి చంపిపిస్తారు.!
Advertisement
మావియా తన కొడుకైన యజీద్ ను …..రాజ్యాధికారిగా నియమిస్తాడు.! ఇదే విషయమై చర్చించడం కోసం హసన్ తమ్ముడు హుస్సేన్… తన మిత్రులు, కుటుంబ సభ్యులు మొత్తం 72 మందితో ( మహిళలు చిన్నపిల్లలు కూడా ఇందులో ఉంటారు) కుఫాకు బయలుదేరుతాడు! ఈ విషయం తెల్సుకున్న యజీద్…. హుస్సేన్ తుదముట్టించాలని తన సైన్యాన్ని పంపుతాడు…. హుస్సైన్ కు యజీద్ సైన్యానికి మధ్య కర్బాలా అనే ప్రాంతంలో 10 రోజుల పాటు భీకర యుద్దం జరుగుతుంది!
10వ రోజు….హుస్సైన్ ఒక్కరే మిగిలి ఉంటారు… శుక్రవారం మధ్యాహ్నం నమాజ్ కోసం శత్రువులనడిగి కొన్ని నిమిషాలు అనుమతి పొంది ప్రార్థనలో నిమగ్నమై ఉండగా శత్రువులు ఇమామ్ హుసైన్‌ను వెన్నుపోటు పొడిచి సంహరించారు. అందుకే ప్రజాస్వామ్య పరిరక్షణకై….శత్రువులతో పోరాటం చేసిన ఈ పది దినాలను సంతాప దినాలుగా పాటిస్తారు!
Advertisements
Advertisements
ఐక్యతను నింపే పండుగ….
గ్రామాల్లో ఈ మొహర్రం ను హిందువులు, ముస్లీంలు కలిసిమెలసి జరుపుకుంటారు.! గ్రామాల్లో పీర్ల పండుగ పేరుతో ఓ సందడి నెలకొంటుంది! అసైదూల అంటూ నిప్పుల్లో నడవడాలు., దూలా…దూలా అంటూ దరువు తగ్గట్టు వేసే అడుగులు., షర్బత్ లు, చక్కెర పప్పుల ప్రసాదాలు….కుడకల దట్టీలు…ఈ కోలాహలం చూడాలంటే గ్రామాలకు వెళ్లాల్సిందే!