Advertisement
తన తల్లి పెన్సన్ డబ్బుల కోసం బ్యాంక్ చుట్టు తిరిగి తిరిగి అలసిపోయింది ఓ మహిళ.. ఫిజికల్ వెరిఫికేషన్ జరిగితే తప్ప డబ్బులు ఇవ్వమని బ్యాంక్ వాళ్లు తెగేసి చెప్పడంతో చేసేదేం లేక మంచాన పడిన తల్లిని మంచంతో సహా బ్యాంక్ వరకు లాక్కెళ్లింది .. ఒడిసాలో చోటుచేసుకున్న ఈ ఘటన తాలుకు వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
ఒడిసాలోని నౌపార్ జిల్లా బర్గావా గ్రామానికి చెందిన 70ఏళ్ల పుంజిమతి దేవి తల్లితో కలిసి నివసిస్తోంది..ఇటీవల ప్రధానమంత్రి గరీభ్ రథ్ యోజనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం జన్ ధన్ ఖాతాల్లో 500రూ చొప్పున వేస్తుంది..ఆ డబ్బుల కోసం మూడు నెలలుగా బ్యాంక్ చుట్టు తిరిగింది పుంజిమతి..ఖాతాదారు ఉంటే తప్ప డబ్బులు ఇవ్వమని బ్యాంక్ మేనేజర్ చెప్పడంతో మంచాన పడిన తల్లిని బ్యాంక్ కి తీస్కెళ్లే మార్గం తోచక, ఏకంగా మంచాన్ని లాక్కుని బ్యాంక్ కి వెళ్లింది..
Odisha: In a video that surfaced recently, a woman was seen dragging her centenarian mother on a cot, to a bank in Nuapada district to withdraw her pension money allegedly after the bank asked for physical verification. pic.twitter.com/XPs55ElINA
Advertisement
— ANI (@ANI) June 15, 2020
Advertisements
Advertisements
మంచంపై తల్లిని లాక్కుని వెళ్తున్న దృష్యాల్ని చూసిన కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు..ఈ విషయంపై “నేను గత మూడు నెలల్లో చాలాసార్లు బ్యాంకుకు వెళ్లి పెన్షన్ ఇవ్వాలని కోరాను, అయితే బ్రాంచ్ మేనేజర్ ఒప్పుకోలేదు,తన తల్లి రాలేని పరిస్థితిలో ఉ:ది అని చెప్పినప్పటికి మంచాన పడిన తన తల్లిని తీసుకొస్తే తప్ప ఇవ్వను అని చెప్పారని చెప్తూ బాధపడింది పుంజిమతి..
ఇదే విషయంపై ఆ జిల్లా కలెక్టర్ మధుస్మితా సాహూ స్పందించారు..వెరిఫికేషన్ కోసం మేనేజర్ ఇంటికి వెళ్లేలోపే పుంజిమతి తన తల్లితో బ్యాంక్ కి చేరుకుందని,బ్యాంక్ పనులన్ని ఒకే వ్యక్తి చూస్కుంటున్న కారణంగా మేనేజర్ మహిళ ఇంటికి వెళ్లలేకపోయారని సాహూ అన్నారు..
సోషల్ మీడియాలో వైరలయిన వీడియోతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..మన దేశంలో భార్య మృతదేహాన్ని తీస్కెళ్లడానికి అంబులెన్స్ ఉండదు, వలస కార్మికులు సొంత గ్రామాలకు వెళ్లడానికి రవాణా సౌకర్యాలుండవు..చంటి పిల్లలు ఆకలితో చచ్చిపోతుంటారు..ముసలి వాళ్లు పెన్షన్ డబ్బులకోసం ఇబ్బంది పడుతుంటారు…అంటూ ఆగ్రహంతో కామెంట్స్ చేస్తున్నారు..