Advertisement
దేశంలో కొత్తగా ఏవైనా స్కాములు జరిగినప్పుడు కొన్ని రోజుల పాటు ఆ హడావిడి ఉంటుంది. వార్తా పత్రికలు, చానళ్లు పదే పదే ఆ విషయాన్ని ఊదరగొడుతుంటాయి. పత్రికల్లో పుంఖాను పుంఖాలుగా వార్తలు రాస్తారు. న్యూస్ చానళ్లు రక రకాల కథనాలను ప్రసారం చేస్తాయి. అయితే కొంత కాలానికి షరా మామూలే. ఎందుకంటే.. మన దేశంలో ఎప్పటి నుంచే ఉన్నదే అది. సెన్సేషనల్ వార్తలు వచ్చినప్పుడే కొద్ది రోజుల పాటు అవి జనాల నోట్లలో నానుతాయి. తరువాత వాటి గురించి అందరూ అందరూ మరిపోతారు. ఇక స్కాముల సంగతి కూడా అంతే.. అప్పట్లో జరిగిన ఓ పెద్ద స్కాం గురించి కూడా జనాలు ఇప్పుడు పూర్తిగా మరిచిపోయారు. అదే.. రూ.251 ఫ్రీడమ్ స్మార్ట్‌ఫోన్ స్కాం..
అప్పట్లో కేవలం రూ.251 చెల్లిస్తే ఫ్రీడం 251 పేరిట ఓ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తామని ఓ కంపెనీ ఊదరగొట్టింది గుర్తుంది కదా. 2016 అక్టోబర్ నెలలో రింగింగ్ బెల్స్ అనే సంస్థ ఈ ఫోన్‌పై యాడ్ ఇచ్చి సంచలనం సృష్టించింది. దీంతో జనాలందరూ ఆ ఫోన్ కోసం ఎగబడ్డారు. ఆ సంస్థ సైట్‌లో రూ.251 చెల్లించి స్మార్ట్‌ఫోన్లను బుక్ చేశారు. కానీ వాస్తవానికి ఇప్పటికీ ఆ ఫోన్లు ఎవరికీ అందలేదు. అందువల్ల ఇది పెద్ద స్కాంగా నిలిచిపోయింది. అయితే దీనిపై అప్పట్లో కేసు నమోదు చేసినా.. అసలది ఏమైందో, విచారణ ఎంత వరకు వచ్చిందో కూడా ఇప్పటికీ తెలియదు.
Advertisement
కేవలం రూ.251 చెల్లిస్తే ఫ్రీడం 251 ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ను ఇంటికే డెలివరీ చేస్తామని అప్పట్లో రింగింగ్ బెల్స్ కంపెనీ చెప్పింది. అందుకు ఓ సైట్‌ను కూడా ఓపెన్ చేశారు. ఆ ఫోన్‌లో 1జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్, వైఫై, బ్లూటూత్, 3.2, 0.3 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు ఉంటాయని చెప్పారు. దీంతో ఆ ఫోన్‌ను రూ.251 చెల్లించి సుమారుగా 5 కోట్ల మంది బుక్ చేశారు. ఓ దశలో సైట్ పనిచేయకుండా పోయింది. అయినప్పటికీ బుక్ చేసిన అందరికీ ఫోన్లను అందజేస్తామని రింగింగ్ బెల్స్ డైరెక్టర్ మోహిత్ గోయెల్, ప్రెసిడెంట్ అశోక్ చడ్డాలు తెలిపారు.
అయితే ఆ కంపెనీ చేస్తున్నదంతా స్కాం అని.. అంత తక్కువ ధరకు ఫోన్‌ను ఎలా ఇస్తారని.. జనాల డబ్బును దోచుకునేందుకే ఇలా చేస్తున్నారని.. ఆ కంపెనీ యజమానులపై చర్యలు తీసుకోవాలని.. అప్పట్లో బీజేపీ ఎంపీ కిరిత్ సోమాలయ ఫిర్యాదు చేశారు. దీంతో ఆ యజమానులపై సెక్షన్ 420 కింద కేసు నమోదైంది. అయితే ఎఫ్ఐఆర్ లో సరైన వివరాలు పొందు పరచలేదని అప్పట్లో అలహాబాద్ హైకోర్టు చెప్పింది. ఆ తరువాత ఆ కేసు ఏమైందో, ఆ కంపెనీ యజమానులు ఏమయ్యారో, 5 కోట్ల మంది నుంచి సేకరించిన రూ.కోట్ల డబ్బు ఏమైందో.. ఇప్పటికీ తెలియదు.
Advertisements
వాస్తవానికి జనాలు ఈ విషయం గురించి పూర్తిగా మరిచిపోయారు. తాము చెల్లించింది కేవలం రూ.251 మాత్రమే కదా.. అని చాలా మంది పట్టించుకోకపోయి ఉండవచ్చు. కానీ 5 కోట్ల మంది రూ.251 చెల్లిస్తే ఎంతవుతుంది ? రూ.1255 కోట్లు అవుతుంది. మరి అంత డబ్బు ఎక్కడికి వెళ్లింది ? అసలు ఆ కంపెనీ ఏమైంది ? ఫోన్లు ఏమయ్యాయి ? అన్న వివరాలను ఎవరూ పట్టించుకోలేదు. అసలు దాని గురించి ఆలోచించడం లేదు. కానీ జనాల డబ్బు తీసుకున్న వారు మాత్రం ఈపాటికి ఎంజాయ్ చేస్తుండవచ్చు. ఏది ఏమైనా.. ఫ్రీడమ్ 251 స్మార్ట్ ఫోన్ సేల్ అనేది ఒక పెద్ద స్కాం అని చెప్పవచ్చు. జనాలు సైలెంట్‌గా ఉండడం వల్ల ఇంత పెద్ద స్కాం జరిగినా నిందితులు ఇంకా ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు..!
Advertisements