Advertisement
అంతర్జాతీయ క్రికెట్ ఆడాలి అంటే ఒక స్థాయి ఉండాలి. భారత్ లాంటి ఎమోషన్ ఉన్న దేశం తరుపున ఆడాలి అంటే మాత్రం గట్స్ ఉండాలి. అలాగే… ఆడే ఆట క్వాలిటీ గా ఉండాలి. ఏదో అవకాశం వచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్టు ఆడితే అభిమానుల నుంచి వచ్చే ఎన్నో అవమానాలు తట్టుకుని నిలబడాలి. అయితే సెలెక్షన్ కమిటీ కూడా అర్హత లేని ఎందరో ఆటగాళ్లను జట్టులో ఎంపిక చేస్తుంది.
Also Read:రైలు కడ్డీలు ఎందుకు అడ్డంగా ఉంటాయి…?
అలా ఎంపిక అయిన ఆటగాళ్లను ఒక్కసారి చూస్తే…
హార్దిక్ పాండ్యా
ఇండియా క్రికెట్ కు మరో కపిల్ దేవ్ గా చెప్పుకున్న ఈ ఆటగాడు… కెరీర్ మొదట్లో కాస్త మెరుపులు మెరిపించినా సరే ఆ తర్వాత జట్టుకి భారం అయ్యాడు. కొందరికి భజన చేసి జట్టులో ఉన్నాడనే ఆరోపణలు చాలానే వినిపించాయి. యువ ఆటగాడిగా ముందు దూకుడు ప్రదర్శించినా తర్వాత నడుం నొప్పి అనే కారణంతో బౌలింగ్ చేయకుండా బ్యాటింగ్ లో పరుగులు చేయకుండా టైం పాస్ చేసాడు.
Advertisements
Advertisement
క్రునాల్ పాండ్యా
హార్దిక్ పాండ్యా అన్న క్రునాల్ పాండ్యా బౌలింగ్ చూసి చాలా మంది అభిమానులు ఆశ్చర్యపోతూ ఉంటారు. అతను వేసేది ఏ బౌలింగ్ అర్ధం కాలేదని సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా వస్తు ఉంటాయి.
విజయ్ శంకర్
అంబటి రాయుడు స్థానంలో జాతీయ జట్టుకి 2019 ప్రపంచకప్ లో ఎంపిక అయిన ఈ ఆటగాడు… జట్టుకి భారంగా మారిపోయాడు అనే విషయం గ్రహించి జట్టు నుంచి తప్పించారు. ఇతని ఆట తీరుపై ఎన్నో విమర్శలు వచ్చాయి అప్పట్లో.
Advertisements
Also Read:క్రికెటర్లకు ఫీల్డింగ్ టైం లో దెబ్బలు తగలకుండా ఏం చేస్తారు…? పేస్ బౌలర్లు అక్కడ ఎందుకు నిలబడరు…?