Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

“ఏనుగమ్మా క్షమించమ్మా.!” అంటూ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న పోస్ట్.!

Advertisement

ఏనుగమ్మా మమ్మల్ని క్షమించగలవా??
క్షమించు అని అడగడానికి కూడా అర్హత లేనివాళ్లం..
జాలి,దయాదాక్షిణ్యం ఏమాత్రం లేని మా మానవమృగాల తరపున అడుగుతున్నాను..మమ్మల్ని క్షమించగలవా?

నీ ఆకలి తీర్చడానికి..  ఆ చిన్న పైనాపిల్ ఏ పాటిదమ్మా ?
అయినా కూడా దానిపై ఆశపడ్డావంటే నీ కడుపులో బిడ్డకి దాని రుచి చూపించాలనుకున్నావా ఏనుగమ్మా?
క్రూరమృగాలు తిరిగే అడవిలోప కూడా నీకు ఇలాంటి పరిస్థితి ఎన్నడూ వచ్చి ఉండదమ్మా…
ఏ క్రూరమృగం కూడా తన పైశాచిక ఆనందం కోసం నీపై దాడి చేయదు, నిన్ను చంపదు కదా ఏనుగమ్మా.

Advertisement

నోట్లో ట‌పాసులు పేలినప్పుడు  ప్రాణం పోతుందేమో అనే భయం కంటే కడుపులోని  నీ  బిడ్డ ఏమైపోతుందని ఎంతగా తల్లడిల్లిపోయుంటావ్ ?
కడుపులో జీవం పోసుకున్న బిడ్డ‌ , నీ కళ్లముందే నిర్జీవంగా మారడానికి ముందే…. నీ తల్లిగుండె బద్దలైపోయుంటుంది కదమ్మా.
ఆ నరకయాతనను తప్పించుకోవడానికి ముందే నీ తల్లిగుండె ఆగిపోయుంటుంది కదా ఏనుగమ్మా?
అసలు ఊహించడానికే ఎంత భయంగా ఉందమ్మా.. నువ్ పడిన యాతన..అయినా అడుగుతున్నాను మమ్మల్ని క్షమించగలవా ఏనుగమ్మా?.

ఆఖరి నిమిషంలో నీ కడుపులోని చిట్టితల్లికి ఏమని నచ్చచెప్పుకుని ఉంటావమ్మా?
“నేను ఆ మానవమృగాల్ని నమ్మాను అని నీ తల్లి హృదయం బేలగా చెప్తుంటే… మరి నా తప్పేంటమ్మా? నాకెందుకు శిక్ష అని నీ చిన్నారి ఏనుగు వేస్తున్న ప్రశ్న మా గుండెల్ని ప్రతిక్షణం పేల్చేస్తుందమ్మా.?

Advertisements

Advertisements

క్షమించు అని అడగడానికి కూడా అర్హత లేనివాళ్లం..జాలి,దయాదాక్షిణ్యం ఏమాత్రం లేని మా మానవమృగాల తరపున అడుగుతున్నాను..మమ్మల్ని క్షమించగలవా ఏనుగమ్మా…

————— BY:  Logical Telugu Team