Advertisement
ఇప్పుడంటే సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది కనుక అధునాతన ఆయుధాలు ప్రతి దేశం వద్దా అందుబాటులో ఉన్నాయి. కానీ నిజానికి ఒకప్పుడు కత్తులు, బాణాలే ఆయుధాలుగా ఉండేవి. అయితే మన దేశాన్ని బ్రిటిష్ వారు పాలించడానికి ముందు నిజానికి మన పూర్వీకులు పలు భిన్న రకాల, పదునైన, ప్రాణాంతక ఆయుధాలను వాడేవారు. వాటిపై ఓ లుక్కేద్దామా..!
1. ఖుకురి
దీన్ని చాలా మంది ఇప్పటికీ వాడుతున్నారు. ముఖ్యంగా గూర్ఖాలు ఈ తరహా కత్తులను వాడుతారు. ఇది ఎంత పదునుగా ఉంటుందంటే ఎముకను కూడా గాయపరిచేంత శక్తివంతంగా ఉంటుంది. కాకపోతే అందుకు చాలా బలంతో ఈ కత్తిని వాడాల్సి ఉంటుంది.
2. ఉరుమి
Advertisements
చూసేందుకు కొరడా రూపంలో ఉన్నా.. అవి స్టీల్‌తో తయారు చేయబడి వంచిన కత్తులు. వాటితో దాడి చేస్తే తీవ్రంగా గాయాలవుతాయి. ఒకప్పుడు కేరళలో ఈ ఆయుధాలను ఎక్కువగా వాడేవారు. ఈ స్టీల్ కొరడాలు 5 నుంచి 6 అడుగుల పొడవు ఉంటాయి. ఒక్కో దాంట్లో 32 వరకు తాడును పోలిన కత్తులు ఉంటాయి.
3. దండ్‌పట్టా
ఒకప్పుడు మరాఠా సైనికులు ఈ ఆయుధాన్ని వాడేవారు. మరాఠా సైనికులు మొగల్ సైనికులను చం పేందుకు అప్పట్లో వీటిని ప్రత్యేకంగా తయారు చేశారు. ఛత్రపతి శివాజీ ఈ కత్తిని చాలా నైపుణ్యంతో వాడేవాడని పేరుంది.
4. కటార్
Advertisement
కత్తులు విరిగిపోతే ఆ ముక్కలను కలిపి ఈ ఆయుధాన్ని తయారు చేసేవారు. అందువల్ల కొన్ని కత్తులు కలిపి ఒకే కత్తిగా పనిచేస్తాయి. ఇవి చాలా తీవ్రంగా గాయపరుస్తాయి.
5. బాగ్ నఖా
దీన్ని ఒకప్పుడు అఫ్జల్ ఖాన్‌ను చం పేందుకు శివాజీ ఉపయోగించాడట. దీంతో శత్రువు శరీరంలోకి విషాన్ని కూడా పంపించవచ్చు. దీంతో చాలా సులభంగా శత్రువును చం పవచ్చు.
6. తల్వార్
ఇది నిజానికి కత్తి లాంటిదే. కాకపోతే చివరి భాగం వంకరగా ఉంటుంది. అందువల్ల శత్రువును సులభంగా గాయాలకు గురి చేయవచ్చు. చం పవచ్చు.
7. కిర్పన్
దీన్ని సిక్కులు ఎక్కువగా ఉపయోగిస్తారు. గురు తెగ్ సింగ్ బహదూర్‌ను ఔరంగ జేబు చం పించినప్పటి నుంచి సిక్కులు కచ్చితంగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని, ఈ కత్తిని ధరించాలని చెప్పారు. దీంతో అప్పటి నుంచి చాలా మంది సిక్కులు ఈ కత్తిని వెంట ఉంచుకోవడం మొదలు పెట్టారు.
8. చక్రం
Advertisements
శత్రువు దగ్గరగా వెళ్లకుండా దూరం నుంచే ఈ చక్రాన్ని విసిరి శత్రువుపై దాడి చేయవచ్చు. అప్పట్లో సైనికులు రెండు చేతులా ఈ చక్రాలను ఆయుధాలుగా వాడేవారు. కాగా కాలక్రమేణా ఈ ఆయుధాలన్నీ అంతరించిపోయాయి. వీటిని ఇప్పుడు చాలా మంది వాడడం లేదు.