Advertisement
ప్రపంచ వ్యాప్తంగా మనం ఏ ప్రాంతానికి వెళ్లినా సరే అక్కడి ప్రాంతీయ వంటకాలు మనకు నోరూరిస్తుంటాయి. భోజన ప్రియులు అయితే ప్రాంతాలతో సంబంధం లేకుండా ఎక్కడ రుచికరమైన వంటకం లభ్యమైనా లొట్టలేసుకుంటూ తింటారు. ఇక అంతర్జాతీయంగా అనేక పేరు ప్రఖ్యాతులు గాంచిన దుబాయ్ నగరంలోనూ పలు ప్రత్యేక స్థానిక వంటకాలు భోజన ప్రియులకు నోరూరింపజేస్తున్నాయి. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హరీస్:
దుబాయ్‌లో అనేక రెస్టారెంట్లు, హోటల్స్‌లో హరీస్‌ను వండుతారు. అక్కడి ప్రజలే కాదు, అక్కడికి వెళ్లే టూరిస్టులు కూడా హరీస్‌ను ఇష్టంగా తింటారు. విందు భోజనాల్లోనూ అక్కడ హరీస్‌ను వడ్డిస్తారు. దీన్ని వండేందుకు చాలా టైం, నైపుణ్యం కావాలి. అందుకనే హరీస్‌ను కేవలం ప్రత్యేక సందర్భాలు, శుభకార్యాలు, వివాహాలప్పుడు విందుల్లో మాత్రమే వడ్డిస్తుంటారు. హరీస్‌ను గోధుమ పిండి, మటన్ లేదా చికెన్, ఉల్లిపాయలు, జీలకర్ర తదితర అనేక పదార్థాలను వేసి వండుతారు. అందువల్ల హరీస్ ప్రత్యేక రుచిని కలిగి ఉంటుంది. ఇది ఎమిరేట్స్ సంప్రదాయ వంటకంగా ప్రసిద్ధి గాంచింది.
మజ్‌బూస్:
Advertisements
ఎమిరేట్స్‌లో అనేక నగరాల్లో దీన్ని అనేక కుటుంబాలు ఇండ్లలోనే వండుతాయి. దుబాయ్‌ను సందర్శించే అనేక మంది మజ్‌బూస్‌ను ఇష్టంగా తింటారు. ఇది కూడా అక్కడి సంప్రదాయ వంటకాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. బాస్మతి రైస్, వివిధ రకాల మాంసాలు, మసాలాలు, కూరగాయలు తదితర పదార్థాలతో దీన్ని వండుతారు. రంజాన్ సందర్భంగా దీన్ని ఎక్కువగా తింటారు.
లుకాయ్‌మత్:
ఎమిరేట్స్ జరిగే సాంస్కృతిక వేడుకల సమయంలో ఈ వంటకాన్ని వండి వడ్డిస్తారు. దుబాయ్ సంప్రదాయ వంటకంగా ఇది పేరుగాంచింది. ఈ వంటకం చూసేందుకు అచ్చం గులాబ్ జామున్‌ను పోలి ఉంటుంది. నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా స్వీట్ బాల్స్ ను తయారు చేస్తారు. పిండి, నువ్వులు, పసుపు, పాలు, చక్కెర, ఉప్పు, ఈస్ట్ వేసి ఈ స్వీట్‌ను తయారు చేస్తారు. దీన్ని చూస్తేనే భోజన ప్రియులకు నోరు ఊరుతుంది.
Advertisement
మద్‌రౌబా:
దుబాయ్‌లోనే కాదు, బహ్రెయిన్, ఓమన్‌లలోనూ ఇది పాపులర్ ఫుడ్. దీన్ని చికెన్‌తో ఎక్కువగా తింటారు. లేదా చేపలు, మటన్‌తోనూ తినవచ్చు. బియ్యం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, టమాటాలు, యోగర్ట్ తదితర పదార్థాలతో దీన్ని తయారు చేస్తారు. మద్‌రౌబా అంటే అరబిక్‌లో స్మూతీ అని అర్థం వస్తుంది. అందువల్ల ఇది నిజంగానే స్మూతీని పోలి ఉంటుంది. దీన్ని ఏ వయస్సు వారైనా తినవచ్చు. సులభంగా జీర్ణమవుతుంది.
ఊజీ:
గల్ఫ్ దేశాల్లో ఈ డిష్ ను ఎక్కువగా తింటారు. పెళ్లిళ్లు, ఇతర వేడుకల్లో విందుల్లో దీన్ని వడ్డిస్తారు. దీన్ని మాంసంతో తింటారు. రంజాన్ సమయంలో ఎక్కువగా తింటారు. బియ్యంతో దీన్ని తయారు చేస్తారు. చికెన్, యోగర్ట్ లేదా సలాడ్‌తో తింటారు.
చికెన్ సలూనా:
దీన్ని చికెన్, పసుపు, ఆలివ్ ఆయిల్, గ్రేటెడ్ జింజర్, మిన్స్‌డ్ గార్లిక్, ఉల్లిపాయలు, మిరపకాయలు, ఇతర మసాలాలు, వైట్ రైస్‌తో తయారు చేస్తారు. ఈ డిష్ లో అనేక విటమిన్లు ఉంటాయి. ఇది పోషకాలను అందించడమే కాదు, భోజన ప్రియుల జిహ్వా చాపల్యాన్ని తీరుస్తుంది. దీన్ని కూడా ఎమిరేట్స్ లో ఎక్కువగానే తింటారు.
Advertisements