Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

TV షో లు అన‌గానే ఠ‌క్కున గుర్తొచ్చేవి ఇవే! మ‌రి ఇందులో మీకు న‌చ్చిన ప్రోగ్రామ్ ఏది?

Advertisement

ఒకప్పుడు ఒకే ఛానల్ దూరదర్శన్..కానీ ఇప్పుడు పదుల సంఖ్యల్లో ఛానల్స్.వందల సంఖ్యల్లో ప్రోగ్రామ్స్.. ఛానల్స్ సంఖ్య పెరిగిపోవడంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తుంటారు.. అన్ని ప్రోగ్రామ్స్ లో కొన్ని మాత్రమే సూపర్ డూపర్ హిట్ అవుతుంటాయి..అలా ట్రెండ్ సెట్ చేసిన కొన్ని ప్రోగ్రామ్స్ గురించి చూద్దాం..

చిత్ర‌ల‌హరి:

దూర‌ద‌ర్శ‌న్ ఛాన‌ల్ ఒక్క‌టే ఉన్న‌ప్పుడు ప్రతి కార్యక్రమం ప్రత్యేకంగా ఉండేది..ముఖ్యంగా శుక్రవారం రాత్రి వచ్చే  చిత్ర‌ల‌హ‌రి అంటే పిచ్చ క్రేజ్…..ఆ మ్యూజిక్ స్టార్ట్ అయితే చాలు … త‌న్మ‌యంత్వంతో గూస్ బ‌మ్స్ వ‌చ్చేవి.!

chitralahari

జబర్దస్త్:

Advertisements

టాప్  TRP  రేటింగ్స్ తో దూసుకుపోయే టివి షో జబర్ధస్త్..  రశ్మి, అనసూయలకి యాంకర్స్ గా, షకలక శంకర్, ధనరాజ్, సుధీర్, చమ్మక్ చంద్ర ఇలా ఎందరో కమెడియన్స్ కి బ్రేక్ ఇచ్చిన షో . సినిమా అవకాశాలు లేకపోయినా జబర్దస్త్ తో అమాంతం పైకెదిగిన కమెడియన్స్ కూడా ఉన్నారు. జబర్దస్త్ జోష్ తో ఎక్స్ట్రా జబర్దస్త్ ని కూడా స్టార్ట్ చేసింది ఈటివి.

jabardast

ఢీ: 

సౌతిండియాలోనే అతిపెద్ద డ్యాన్స్ షో ఢీ.. ఇప్పటికి పదకొండు సీజన్లు కంప్లీట్ చేసుకుని ఢీ చాంపియన్స్ గా పన్నెండవ సీజన్లో దూసుకుపోతుంది..ఫస్ట్ సీజన్ కి ప్రభుదేవ గెస్ట్ గా వచ్చినప్పుడు ఎంతటి క్రేజ్ ఉందో ఇప్పటికి అదే క్రేజ్ తో రన్ అవుతుంది .ఢీ ఆరు సీజన్ల వరకు వరుసగా ఉదయభాను యాంకర్ గా వ్యవహరించడం విశేషం.తర్వాత నిహారిక రెండు సీజన్లు హోస్ట్ గా చేయగా, తర్వాత నుండి ఇప్పటివరకు ప్రదీప్ హోస్ట్ గా ఉన్నాడు..తెరవెనుక ఉండే డ్యాన్స్ మాస్టర్లు శేఖర్ మాస్టర్,బాబా భాస్కర్, రఘు వీళ్లంతా ఢీ షో ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయినవారే..

బతుకు జట్కా బండి

సామాజిక బాధ్యత వహిస్తూ కుటుంబాల మధ్య వివాదాలను పరిష్కరించడానికి జీ టివి ప్రారంభించిన  కార్యక్రమమే బతుకు జట్కా బండి..ఈ షో ద్వారా ఎన్నో కుటుంబాలకు న్యాయ, మానసిక సలహాలను అందించేవారు.. ఈ షోకి తొలుత జీవిత యాంకర్ గా వ్యవహరించగా, తర్వాత సుమలత,  ప్రస్తుతం రోజా హోస్ట్ గా వ్యవహరిస్తుంది..

పాడుతా తీయగా

అత్యంత ప్రేక్షకాధరణ పొందిన ఈటీవి వారి మరో షో పాడుతా తీయగా..1996లో స్టార్ట్ అయిన ఈ ప్రోగ్రామ్ ఇప్పటికి నిరాఘాటంగా కొనసాగుతూనే ఉంది.. మొదటి నుండి ఇప్పటివరకు బాలసుబ్రహ్మణ్యం వ్యాఖ్యాతగా వ్యవహరించగా..ఈ కార్యక్రమం ద్వారా ఎందరో సింగర్స్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు..కౌసల్య, ఉషా, మల్లిఖార్జున్, హేమచంద్ర,  స్మిత, కారుణ్య,గోపికా పూర్ణిమా వీళ్లంతా ఈ కార్యక్రమం ద్వారా వెలుగులోకి వచ్చినవారే..

paduta teeyaga

మీలో ఎవరు కోటీశ్వరుడు?

అమితాబ్ యాంకర్ గా వచ్చిన కౌన్ బనేగా కరోడ్ పతి(KBC) ప్రోగ్రామ్ ని తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు గా రూపొందించారు.మొదటి మూడు సీజన్లకు  నాగార్జున యాంకర్ గా వ్యవహరించగా ప్రోగ్రాం సూపర్ టిఆర్పితో సాగిపోయింది., నాలుగో సీజన్ కి చిరంజీవి సారద్యం వహించారు..కొంచెం సోసోగా నడిచినప్పటికి ప్రోగ్రాం ఓవరాల్ గా హిట్ అయింది.

Advertisement

Meelo-Evaru-Koteeswarudu-chiranjeevi-telugu-host-maa-show

బిగ్ బాస్

యంగ్ టైగర్ NTR యాంకర్ గా ప్రారంభమైన షో బిగ్ బాస్ రియాలిటి షో..సెకండ్ సీజన్ నాని, థర్డ్ సీజన్ నాగార్జున హోస్ట్ లుగా సాగిన ఈ రియాలిటి షో.. నాలుగో సీజన్ కి సిద్దమైంది.. స్టార్ట్ అవుతుంది..రాబోతుంది అని తెలిసినా యాంకర్ ఎవరనేదానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది..నాగార్జునే ఫైనల్ అని టాక్.!

భలే ఛాన్సులే

సుమ యాంకర్ గా వచ్చిన సూపర్ హిట్ ప్రోగ్రాం భలే ఛాన్సులే..ఈ ప్రోగ్రాం ని రీ టెలికాస్ట్ చేసినా కూడా వ్యూయర్స్ సంఖ్య తగ్గలేదంటే కేవలం సుమ యాంకరింగ్ మహత్యమే.. టివి,సినిమా సెలబ్రిటిస్ తో సుమ  ఆడే వైకుంఠపాలి భలే ఛాన్సులే..

bhale chansule

స్టార్ మహిళ

ఒకే యాంకర్ తో ఎక్కువ కాలం రన్ చేసిన ప్రోగ్రామ్ గా స్టార్ మహిళ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కింది.2008లో ప్రారంభమైన ఈ షో ప్రతిరోజు మద్యాహ్నం ఈ టివిలో వచ్చేది.. మహిళలకోసం రూపొందించబడిన ఈ ప్రోగ్రామ్ అత్యంత ప్రేక్షకాదరణ పొందిన షోగా గుర్తింపు పొందింది.

తీన్మార్

24 గంటల న్యూస్ మధ్య బ్రేక్ లా ఎంటర్టైన్మెంట్ కోసం ఎన్ని ప్రోగ్రామ్స్ వచ్చినా తీన్మార్ లెక్క వేరు.. పూర్తిగా తెలంగాణా యాసలో  కొనసాగే ఈ షోకి రెండు తెలుగు రాష్ట్రాల్లో పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు.. యాంకర్లు మారినా ప్రోగ్రామ్ పై ఆసక్తి మారలేదు.. రాములమ్మ,సావిత్రి,మంగ్లి, మల్లన్న,సత్తి ఇలా ఎందరినో పరిచయం చేసింది తీన్మార్.

కొంచెం టచ్ లో ఉంటే చెప్తా

మేల్ యాంకర్స్ కి అంత గుర్తింపు ఉండదు అనే దాన్ని పక్కన పెట్టి మరీ క్రెడిట్ కొట్టేశాడు యాంకర్ ప్రదీప్ .. కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అనే షో లో సెలబ్రిటిలను ఇంటర్వ్యూ చేస్తూ వారిని ప్రేక్షకులకు మరింత చేరువ చేశాడు.. ZEE  టివిలో వచ్చిన సూపర్ హిట్ షో ఇది.

koncham touch lo unte chepta

టాక్ ఆఫ్ ది టౌన్

టాక్ ఆఫ్ ది టౌన్ అనగానే యాంకర్ ఝాన్సి, మనుషుల్ని ఇమిటేట్ చేస్తూ వారానికొక వేషదారణతో ఝాన్సి చేసిన యాంకరింగ్ ఇప్పటికి ఎవరూ మర్చిపోలేరు..సుమారు పదేళ్లపాటు ఈ షో జెమినిటివిలో ప్రసారం అయింది.

ఆట

ZEE లో వచ్చిన మరో బిగ్గెస్ట్ షో ఆట.. ఈ షో కి యాంకర్ గా వ్యవహరించింది ఓంకార్..యంగ్ టాలెంట్ డ్యాన్సర్స్ వెలికి తీసి వారిని పరిచయం చేసిన షో..ఈ షో తర్వాత ఛాలెంజ్, సిక్స్త్ సెన్స్ లాంటి షోస్  కి యాంకర్ గా వ్యవహరించి,డైరెక్టర్ గా సెట్ అయిపోయాడు ఓంకార్.

Advertisements

omkar aata

పటాస్

రవి ,శ్రీముఖి యాంకర్స్ వచ్చిన పటాస్ కామెడి షో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వంచింది..ముఖ్యంగా యూత్ ని ఎక్కువగా ఆకట్టుకుంది ఈ షో.బిగ్ బాస్ కారణంగా శ్రీముఖి షో నుండి వెళ్లిపోగా తన స్థానంలోకి విష్ణుప్రియ వచ్చింది.