Advertisement
పోస్టాఫీస్ లో అందుబాటులో ఉన్న నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీం ను సద్వినియోగం చేసుకుంటే అద్భుతమైన రిటన్స్ వచ్చే అవకాశాలున్నాయి.! ప్రతి మూడు నెలలకు మనకు వచ్చే వడ్డీని అసలుకు కలిపి మళ్లీ దానిపై వడ్డిని లెక్కిస్తారు…ఇలా వడ్డీపై కూడా వడ్డీ లభిస్తుంది. పైగా పోస్టాఫీస్ లో పెట్టిన డబ్బుకు 100 శాతం సెక్యురిటీ….అందుకే బ్యాంక్ FD, ఇతరులకు వడ్డీలకు డబ్బు ఇవ్వడం కంటే కూడా ఈ స్కీమ్ లో చేరడం మంచి నిర్ణయం అవుతుంది!
Advertisement
నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీంలో మెచూరిటీ పీరియడ్ 5 ఏళ్లు ఫిక్స్‌డ్‌గా ఉంటుంది. అయితే ఏడాది తరువాత నిర్దిష్టమైన కారణాలు చూపి డబ్బును విత్ డ్రా చేసుకునే అవకాశముంది! ఇక ఈ స్కీంలో పెట్టే డబ్బుకు ప్రతి 3 నెలలకు ఒక సారి వడ్డీని లెక్కించి అసలుకు కలుపుతారు. అందువల్ల మనం పెట్టే డబ్బుకు ఎప్పటికప్పుడు వడ్డీ యాడ్ అవుతుంది!
ఈ పథకంలో కనీసం రూ.100తో పొదుపు ప్రారంభించవచ్చు. 5 ఏళ్ల తరువాత రూ.20.85 లక్షల మొత్తం కావాలనుకుంటే 5 ఏళ్లలో రూ.15 లక్షల పెట్టుబడి పెట్టాలి. దీంతో 6.8 శాతం వడ్డీతో అదనంగా మరో రూ.6 లక్షల లాభం వస్తుంది. ఇక ఈ స్కీంలో పెట్టుబడి పెట్టే డబ్బుకు ఏడాదికి రూ.1.50 లక్షల వరకు ఆదాయపు పన్ను చట్టం 80 సి ప్రకారం పన్ను మినహాయింపు లభిస్తుంది.
Advertisements
Note: మరిన్ని వివరాలకు దగ్గర్లోని పోస్టాఫీస్ ను సంప్రదించండి
Advertisements