Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

ఈశ్వ‌ర్ కి సాహోకి మ‌ధ్య‌లో ప్ర‌భాస్ వ‌దులుకున్న 9 సినిమాలు!

Advertisement

ఈశ్వ‌ర్ తో కెరీర్ ను స్టార్ట్ చేసి….చ‌త్ర‌ప‌తితో స్టార్ హీరోగా ఎదిగి బాహుబ‌లితో ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు ప్ర‌భాస్. ఈ క్ర‌మంలో త‌ను అనేక క‌థ‌ల‌ను రిజెక్ట్ చేశాడు. వాటిలో కొన్ని క‌థ‌లు న‌చ్చ‌క మ‌రికొన్ని డేట్స్ కుద‌ర‌క వ‌దులుకున్న‌వే!

ప్ర‌భాస్ ఏ ఏ సినిమాలు వ‌దులుకున్నాడో వాటికి గ‌ల కార‌ణాలేంటో ఇప్పుడు చూద్దాం!

దిల్:

డైరెక్టర్  వివి వినాయక్  దిల్  కథని  మొదట  ప్రభాస్ కి చెప్పాడట , కానీ  కృష్ణంరాజు  సలహా  తీసుకొని  ఆ కథని  రిజెక్ట్  చేసాడు  ప్రభాస్ .  తర్వాత  ఇదే  కథ ఎన్టీఆర్ కి  కూడా  వినిపించాడు  వినాయక్  కానీ చివరకు  నితిన్ తో  చేసాడు.

Advertisements

సింహాద్రి:

రాజమౌళి  సింహాద్రి  కథని  మొదట  ప్రభాస్ తో చేయాలని  ఆయనకు  చెప్తే ..  స్టూడెంట్ నెంబర్ వన్ లాంటి సాఫ్ట్ ట‌చ్ ఉన్న సినిమా  చేసిన  రాజ‌మౌళి  సింహాద్రి లాంటి మాస్ స్టోరీని చేయగలడా  అనే  డౌట్ తో  ప్రభాస్ రాజమౌళి కి నో  చెప్పాడట.  కానీ  ఈ సినిమా ఎన్టీఆర్ తో  చేసి  సూపర్ హిట్  కొట్టాక  రాజమౌళి తో ఎలాగైనా  నెక్స్ట్  సినిమా  చేయాలనుకున్నాడట ప్రభాస్ .

simhadri movie image

ఆర్య:

సుకుమార్  డైరెక్షన్లో  దిల్ రాజు ప్రొడ్యూసర్ గా  చేస్తున్న  సినిమా  ఆర్య…. సుక్కు ఈ కథ పట్టుకొని చాలామంది  హీరోల  దగ్గరకు తిరిగాడట‌…  అందులో  ప్రభాస్  కూడా  ఒకరు. కథ చెప్పగానే  విని నాకు  నచ్చలేదు  అని రిజెక్ట్  చేసాడట ప్ర‌భాస్.

కిక్:

రవితేజ  చేసిన  కిక్  సినిమా  కథని  కూడా  ముందుగా  డైరెక్టర్  సురేందర్ రెడ్డి  ప్రభాస్ కి  చెప్పాడు .  అతను  కథ  నచ్చింది  కానీ  హీరో క్యారెక్టరైజేషన్  తనకి  సెట్  అవ్వదని  రిజెక్ట్  చేసాడట‌ ప్రభాస్ .

Advertisement

బృందావనం:

ప్రభాస్ తో  మున్నా   సినిమా  చేసిన  డైరెక్టర్ వంశీ పైడిపల్లి  తన తర్వాత  కథని  కూడా  ప్రభాస్ తో చేయాలని  కొరటాల శివతో  కలిసి  వెళ్లి  చెప్పాడట కానీ  తన  డేట్స్  అడ్జెస్ట్  కాకపోవడంతో  ఈ సినిమాని వదులకున్నాడు  ప్రభాస్.

డాన్ శ్రీను:

డైరెక్టర్ గోపిచంద్  మలినేని  బుజ్జిగాడు  సినిమాలో ప్రభాస్  క్యారెక్టరైజేషన్  నచ్చి  దాని  ఇన్స్పిరేషన్ తో డాన్ శీను  కథని  రాసుకున్నాడట .  ప్రభాస్ కి  ఈ కథ చేయాలని  ఉన్నా  ప్ర‌భాస్ కు డేట్స్ కుద‌ర‌ని కార‌ణంగా ర‌వితేజ తో చేయాల్సి వ‌చ్చింది.

నాయక్:

వివి వినాయక్  ప్రభాస్ తో  చేసిన  యోగి  సినిమా ప్లాప్  అవడంతో  మళ్ళీ  ఎలాగైనా  ప్రభాస్ కి  హిట్ ఇవ్వాలని ,  నాయక్ కథతో  ప్రభాస్  దగ్గరకు  వెళ్ళాడు  వినాయక్ .  కథ  అంత‌గా న‌చ్చిన ప్రభాస్ నో చెప్పాడ‌ట‌.

రన్ రాజా రన్:

కేవలం  ప్రభాస్  కోసమే  అతన్ని  దృష్టిలో  పెట్టుకొని , కథ  రెడీ  చేసుకొని  వెళ్ళాడు  డైరెక్టర్  సుజిత్.  కానీ అప్పటికే  బాహుబలి లాంటి  పెద్ద  ప్రాజెక్ట్ కు  ఫిక్స్ అయిన  ప్రభాస్  ఈ కథని  శర్వానంద్ తో  చేయమని సుజిత్ కు స‌ల‌హా ఇచ్చాడ‌ట‌.

జిల్:

డైరెక్టర్  రాధా క్రిష్ణ  జిల్  సినిమా  కథ  ప్రభాస్ తో  చేస్తే బాగుంటుందని  ప్రభాస్ కి  చెప్పగా ,  బాహుబలి వల్ల ఇప్పట్లో  కుదరదని ,  తన ఫ్రెండ్  గోపిచంద్  ఈ కథకి బాగా  సెట్  అవుతాడని  చెప్పాడట‌ ప్రభాస్ .

 

Advertisements