Advertisement
అది 2016 మే 31 ….. ఇంకా 7 నెలలు కూడా నిండలేదు….అప్పుడే తల్లికి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. తప్పని పరిస్థితుల్లో డాక్టర్లు ఆపరేషన్ చేశారు. అదిగో అలా డాక్టర్ల కత్తుల సహాయంతో ఈ ప్రపంచంలోకి వచ్చింది ఈ పాప!
పుట్టు కామెర్లు (హై లెవల్- జాండీస్) బతకడం చాలా కష్టమని తేల్చేశారు డాక్టర్లు . మరోవైపు పాపకు జన్మనిచ్చిన తల్లి స్పృహలో లేదు . ..ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో తండ్రి.! ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం మాసం ముద్దలాంటి ఆ పాపను హైద్రాబాద్ కు తీసుకురావాల్సి వచ్చింది . పాపను 5 రోజుల పాటు NICU లో ఉంచారు.
తల్లి ఓ హాస్పిటల్ లో, అప్పుడే పుట్టిన కూతురు మరో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఓ వైపు భార్య గురించి, మరో వైపు కూతురి గురించి ఆలోచిస్తూ…… ఆ తండ్రి నరక యాతన పడుతున్నాడు. అంతలోనే అర్జెంట్ గా O(-) బ్లడ్ కావాలని చెప్పారు డాక్లర్లు, అప్పటికే సమయం రాత్రి 12 దాటింది. ఆ సమయంలో తెలిసిన బ్లడ్ బ్యాంక్ లకు కాల్ చేసినా…O(-) అయితే అందుబాటులో లేదని చెప్పారు. ఈ క్రమంలో కోదాడ నుండి ఓ పరిచయమున్న వ్యక్తి అంత రాత్రి వేళ సమయం తీసుకొని మరీ వచ్చి బ్లడ్ ఇచ్చి వెళ్ళాడు.
Advertisement
ఇలా మూడు రోజుల పాటు NICU లో ఉన్న ఆ పాపను చూడనివ్వలేదు. మంచి ట్రీట్మెంట్ కారణంగా కొద్ది కొద్దిగా కోలుకుంటూ వచ్చింది ఆ పాప.
Advertisements
Advertisements
ఇదంతా గతం…. ఇప్పుడు ఆ పాపను చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది. తన చలాకీ తనాన్ని చూస్తూ అలాగే ఉండిపోవాలనిపిస్తుంది. తన తత్తర మాటలు వింటుంటే భలే నవ్వొస్తుంది. పుట్టుకతోనే చావును బలంగా ఎదురిస్తూ నా కళ్లముందే ఈ లోకంలోకి వచ్చిన ఈ పాప నాకు ఎప్పటికీ ఓ స్పూర్తివంతమైన పాఠమే.! హాస్పిటల్ లో అచేతన స్థితి ఉన్న సమయాన నా కళ్లారా చూసిన ఆ పాపకు…..ఇటీవల వాళ్లింట్లో చలాకీగా తచ్చాడుతున్న ఈ పాపకు ఎంత తేడా….? పొత్తిళ్లలోనే ఓ పెద్ద పోరాటం చేసిన యోధురాలు ఈ పాప.
అనట్టు మరిచిపోయాను…ఈ పాప పేరు ప్రజ్ఙశ్రీ … మే 31 ఈ పాప బర్త్ డే- సో మీరంతా విష్ చేయండి…అసలే అమ్మ కడుపులో కంఫర్ట్ గా లేదని రెండు నెలల ముందే బయటికి వచ్చిన సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ మరి!