Advertisement
ప్రపంచంలోని 7 వింతలు…అని చిన్నప్పటి నుండి చదువుకుంటూనే ఉన్నాం. కానీ చైనా వాల్, తాజ్ మహాల్ ఈ రెండే గుర్తుంటాయి..మరి మిగితా 5 ఏవి? ఈ వింతలు 7 యే ఉన్నాయా? అప్పుడప్పుడు మారుతూ ఉంటాయా? అనే విషయాలు ఇప్పుడు తెల్సుకుందాం.!
7 అనేది గ్రీకులకు ఇష్టమైన నెంబర్… ఈ నెంబర్ ను పరిపూర్ణతకు, సమృద్దికి చిహ్నంగా భావిస్తారు. అయితే ప్రపంచ వింతలు ప్రాచీన యుగానికి, మద్య యుగానికి, ఆధునికి యుగానికి వేర్వేరుగా గుర్తించబడ్డాయి! ఆధునిక యుగంలో కూడా ఒక్కో సంస్థ తమకిష్టమైన 7 ప్రదేశాలను ప్రపంచ వింతలుగా ప్రకటించింది. అయితే అన్నింట్లోకి ఎక్కువమంది విశ్వసించే…… 7 వింతల గురించి ఇప్పుడు చూద్దాం.!
చైనా గోడ:
6,508 కి.మీ పొడవున్న ఈ గోడను క్రీ.పూ. 5, 6 శతాబ్దాల కాలంలో “ఖిన్ షీ హువాంగ్ చే ప్రారంభించబడింది. తర్వాత ‘మింగ్ వంశ’ కాలంలో పూర్తిచేయబడింది.
పెట్రా..
క్రీపూ 6 వ శతాబ్దంలో నిర్మించిన ఈ అద్భుత కట్టడం జోర్డాన్ నగరంలో ఉంది.
Advertisements
క్రీస్ట్ ద రీడీమర్
98 ఫీట్ల ఏసుక్రీస్తు విగ్రహం . ఇది బ్రెజిల్ లో కలదరు. 1920 నుండి 1931 లో దీని నిర్మాణం జరిగింది.
మాచు పిక్చు
సముద్రమట్టానికి 2,430 మీటర్ల ఎత్తున 15 వ శతాబ్దంలో ఓ రాజు కు చెందిన ఎస్టేట్ ఇది.
Advertisement
చిచెన్ ఇట్జా..
మెక్సికోలో ఉన్న చిచెన్ ఇట్జా …. మాయన్ నాగరికత పరిఢవిల్లిన ప్రాంతం. క్వెట్జాల్కోట్ అనే రాజు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పాలించాడు.
కొలోస్సియం
ఇది రోమన్ సామ్రాజ్యం చే నిర్మించబడిన అతిపెద్ద ఓపెన్ థియేటర్. ఇటలీలో నిర్మించబడింది.
తాజ్ మహాల్.
భారతదేశంలోని ఆగ్రా నగరంలో ఉంది. ఇది చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్ధంగా నిర్మించాడు.
ఈజిప్టు పిరమిడ్లు.
ఈజిప్టు రాజుల సమాధులు. ప్రపంచంలో అత్యంత గొప్ప, అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించబడ్డాయి. ఈ పిరమిడ్ల నిర్మాణానికి దాదాపు వెయ్యి సంవత్సరాల కాలం పట్టింది.
Advertisements