Advertisement
1996లో దర్శకుడు కదీర్ చేసిన సంచలనం ‘ప్రేమ దేశం’. ఈ సినిమా యూత్ ను ఓ రకమైన మత్తులో ముంచెత్తింది! ప్రేమ, స్నేహాలకు ముఖ్యమైన విలువ ఏర్పడే టీనేజ్లో ఉన్న వాళ్లందరూ ఈ సినిమాను పదే పదే చూశారు. మొదటిసారి హీరోగా నటించిన అబ్బాస్ ఈ సినిమాతో ఆడపిల్లల కలల రాకుమారుడు అయ్యాడు.
ఈ సినిమాలోని ‘ముస్తఫా.. ముస్తఫా’ పాటకు థియేటర్స్లో గ్రూపులు గ్రూపులుగా నిలబడి కుర్రాళ్లు డాన్స్లు చేశారు. ప్రేమకు కొత్త ఫార్ములాను యాడ్ చేసి సరికొత్త క్లైమాక్స్ తో ముగించి….సినిమా లవర్స్ కు మర్చిపోలేని సినిమాను అందించాడు డైరెక్టర్!
Advertisement
ఇక ఈ సినిమాకు రెహ్మాన్ ఇచ్చిన పాటలు ….. ‘హలో డాక్టర్… హార్ట్ మిస్సాయే’… ‘ వెన్నెలా వెన్నెలా’, ‘కాలేజీ స్టయిలే’.. ‘ప్రేమా’… ఇప్పటికీ హాట్ ఫేవరెట్లే! అద్భుతమైన ఫొటోగ్రఫీ, సంగీతం, దర్శకత్వం, నటీనటులు ఇవన్నీ ‘ప్రేమదేశం’ ను చిరకాలం నిలిచేలా చేశాయి.
Advertisements
Advertisements
‘ఒక గుడిలో ఎంతమంది దేవుళ్లైనా ఉండొచ్చు.. కాని ఆడదాని గుండెలో ఇద్దరు మగాళ్లు ఉండకూడదు’ వంటి మార్క్ డైలాగులు కూడా చాలా ఉన్నాయి. ఈ డైరెక్టర్ యే తర్వాత ‘ప్రేమికుల రోజు’ సినిమా తీశాడు. ఈ సినిమా తర్వాత యూత్ అంతా అబ్బాస్ హెయిర్ స్టైల్ ను ఫాలో అయ్యారు.