Advertisement
అర్మేనియాకు, అజర్‌బైజన్‌కు మధ్య సెప్టెంబర్ నెల నుంచి యుద్ధం జరుగుతున్న విషయం విదితమే. ఆ యుద్ధంలో ఇప్పటికే సుమారుగా 1వేయి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ యుద్ధంలో పాల్గొనేందుకు తాను శిక్షణ తీసుకుంటున్నానని అర్మేనియా ప్రధాని నికోల్ పషిన్యన్ భార్య హకొబ్యాన్ తెలిపింది. ఈ మేరకు ఆమె తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.
హకొబ్యాన్ ఇప్పటికే కొంత మంది మహిళలతో కలిసి 7 రోజుల పాటు కోంబాట్ ట్రెయినింగ్‌లో శిక్షణ తీసుకుంది. ఆయుధాలను ఎలా వాడాలి, వాటిలో ఉపయోగించే బుల్లెట్లు తదితర విషయాలపై ఆమె శిక్షణ తీసుకుంది. ఇక ఇప్పుడు 13 మంది మహిళలతో కలిసి ఆమె మిలిటరీ ట్రెయినింగ్ తీసుకోనున్నట్లు వెల్లడించింది. ట్రెయినింగ్ పూర్తయిన వెంటనే నాగొర్నొ-కరబఖ్ ప్రాంతంలో అర్మేనియా మిలటరీతో కలిసి ఆమె అజర్‌బైజన్‌పై జరుగుతున్న యుద్ధంలో పాల్గొననుంది.
Advertisement
Advertisements
అయితే 42 ఏళ్ల హకొబ్యాన్‌కు 20 ఏళ్ల కుమారుడు అషత్ పషిన్యన్ ఉన్నాడు. అతను కూడా అజర్‌బైజన్‌పై పోరాటం చేసేందుకు శిక్షణ తీసుకున్నాడు. కాగా హకొబ్యాన్ అర్మేనియన్ టైమ్స్ న్యూస్ పేపర్‌కు చీఫ్ ఎడిటర్‌గా కూడా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె అమెరికా, కెనడా, ఫ్రాన్స్, బ్రెజిల్, లెబనాన్, సింగపూర్, లిథుయానియా, అర్జెంటినా, వియత్నాం దేశాలకు చెందిన అధ్యక్షుల భార్యలకు లేఖలు కూడా రాసింది. అర్మేనియాకు, అజర్‌బైజన్‌కు మధ్య జరుగుతున్న యుద్ధం ఆగేందుకు చర్యలు తీసుకోవాలని కోరింది. నాగొర్నొ-కరబఖ్ ప్రాంతానికి స్వాతంత్య్రం ఇవ్వాలని ఆమె లేఖల్లో కోరింది.
Advertisements
కాగా యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా, రష్యా దేశాలు ఇప్పటికే విడివిడిగా కాల్పుల విరమణ ఒప్పందాలను చేసేందుకు యత్నించాయి. కానీ ఆ దేశాల ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో అర్మేనియాకు, అజర్‌బైజన్‌కు మధ్య యుద్ధం నిరంతరాయంగా కొనసాగూతూనే ఉంది.