Advertisement
సాధారణంగా ప్రపంచంలోని అందరూ బాగా డబ్బు సంపాదించి కోటీశ్వరులు అవ్వాలని కలలు కంటుంటారు అందుకోసం జీవితంలో పరిగెడుతుంటారు. కానీ వేల్స్ కు చెందిన లేట్ ప్రిన్సెస్ డయానా రాయల్ రూల్స్ ను బ్రేక్ చేస్తూ తన పిల్లల స్కూల్ లో నిర్వహించిన రేసులో పరిగెత్తారు అలాగే గెలుపొందారు కూడా ఈమె రాజుల కుటుంబాలలో ఉన్న నిబంధనలను రూల్స్ ను ఎప్పుడు పెద్ద పట్టించుకోకుండా తనకంటూ కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ని ఏర్పరుచుకున్నారు.
Advertisement
అప్పట్లో రాజుల కుటుంబాలలో పిల్లలు స్కూల్స్ కి వెళ్లి చదివేవారు కాదు వాళ్ళ ఇంటికి టీచర్స్ వచ్చి చదువు చెబుతుండేవారు.కానీ దీన్ని పక్కన పెట్టిన లేట్ ప్రిన్సెస్ డయానా తన పిల్లలను స్కూల్ కి పంపించి చదివించేవారు.వాళ్ళకి అందరిలాగా నార్మల్ లైఫ్ ను ఇవ్వడానికి పాటు పడేవారు. అందులో భాగంగా 1991 లో తన పిల్లలు చదివే స్కూల్ యాజమాన్యం వారు మదర్స్ డే సందర్భంగా నిర్వహించిన రన్నింగ్ రేసులో స్కర్ట్, బ్లేజర్ వేసుకున్న ఈమె ఒట్టి కాళ్ళతో వీలైనంత వేగంగా పరిగెత్తి గెలుపొందారు.ప్రస్తుతం దానికి సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది.దాని పై మీరు కూడా ఓ లుక్ వేయండి.
Advertisements
Advertisements