Advertisement
ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారా? అయితే ఈ కథ మీకోసమే….. ప్రైవేట్ కంపెనీలు ఎలా మనల్ని మడత పెట్టేస్తాయో తెలిపే చిట్టి ఎలుక కథ ఇది! ఈ కథ ద్వారా మీరు మూడు విషయాలను నేర్చుకోవాలి…అప్పుడే మీ లైఫ్ ను హ్యపీగా లీడ్ చేయగలరు…లేదా జీవితాంతం కంపెనీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ కథలోకి వెళ్దాం……!
ఓ ఎలుకను తీసుకొచ్చి…. ధాన్యంతో నిండిన జార్ మీద కూర్చోబెడుదాం….ఇంక ఆ ఎలుకకు ఆహారం కోసం వేటాడాల్సిన అవసరమే లేదు…హాయిగా అదే జార్ మీద కూర్చొని తింటూ కాలం వెల్లదీస్తుంది….. రోజులు గడుస్తున్నా కొద్ది….ఆ జార్ లోని గింజలు అయిపోతుంటూ…ఎలుక మెల్లిగా ఆ జార్ లోకి దిగజారుతూ ఉంటుంది! ఒకానొక దశలో జార్ లో గింజలన్నీ అయిపోతాయి…. ఎట్ ది సేమ్ టైమ్ ఎలుక జార్ లోకి కూరుకుపోతుంది. బయటికి వచ్చే ఆప్షన్ కూడా లేకుండా పోతుంది! ఇప్పుడు ఎలుక పూర్తిగా ఇతరుల మీద ఆధారపడే స్థితికి చేరుకుంది!
Advertisement
సేమ్ టు సేమ్….. మొదట్లో ఉద్యోగంలో చేరిన కొత్తలో మనం మన టాలెంట్ ను అంతా చూపుతూ ప్రమోషన్స్ …బోనస్ లు సంపాధిస్తుంటాం..రాను రాను…ఉద్యోగం తప్ప మరే ఇతర నైపుణ్యాలను వృద్ది చేసుకోము….ఉద్యోగమే సర్వస్వం, మేనేజర్ దృష్టిలో పడితే చాలు అనే భ్రమలోనే బతికేస్తుంటాం… అవసరం లేని వస్తువుల కొనుగోళ్లు, క్రెడిట్ కార్డులు, EMI లకు అలవాటు పడతాం…. వన్ ఫైన్ డే ….. మీరు చేసే పనిని మీకంటే తక్కువ జీతానికే చేయడానికి వేరే వాడు రెడీగా ఉంటాడు….అప్పుడు మిమ్మల్ని నిర్ధాక్షిణ్యంగా బయటికి పంపేస్తారు…… ఉద్యోగానికే పరిమితమైన మీరు…మీలోని ఇతర నైపుణ్యాలను పూర్తిగా మర్చిపోయి ఉంటారు.! ఫైనల్ గా జార్ లోని ఎలుక లాగా…యాజమాన్యం చెప్పిన దానికి మౌనంగా తలూపుకుంటూ బతికేస్తారు!
Advertisements
ఈ కథ ద్వారా నేర్చుకోవాల్సిన 3 విషయాలు
Advertisements
- సెకండ్ ఇన్ కమ్ సోర్స్ ను క్రియేట్ చేసుకోవాలి!
- సంపాదన – ఖర్చు 3:1 నిష్పత్తిలో ఉండేలా చేసుకోవాలి!
- మీలోని ఇతర నైపుణ్యాలను అభివృద్ది చేసుకుంటూ ఉండాలి!