Advertisement
ఇప్పటి వరకు ఇండియాలో ఎంపైర్ అవ్వడానికి ప్రత్యేకమైన కోర్సులైతే లేవు కానీ..సెలెక్షన్స్ కి మాత్రం ఓ పద్దతి ఉంటుంది. ఆ ప్రాసెస్ ను ఫాలో అవుతూ…. ఆ పరీక్షల్లో నెగ్గుతూ వెళ్తే ఎంపైర్స్ అయ్యే అవకాశం లభిస్తుంది. కానీ అది అంత అషామాషీ విషయమైతే కాదు!
స్టేజ్-1 :
స్టేట్ క్రికెట్ అసోసియేషన్ అంపైర్స్ రిక్రూట్మెంట్ పై ప్రకటన చేస్తుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మూడు రోజుల ఓరియెంటేషన్ ప్రోగ్రామ్ ను నిర్వహించి….క్రికెట్ రూల్స్ కు సంబంధించిన రెండు బుక్స్ ఇచ్చి… దానికి కొన్ని రోజుల సమయమిచ్చి….పరీక్షను నిర్వహిస్తారు. అందులో క్వాలిఫై అయినవారిని BCCI కి రిఫర్ చేస్తారు.
స్టేజ్ -2 :
Advertisements
ఇది BCCI లెవల్లో ఉంటుంది. ఇందులో మూడు లెవల్స్ ఉంటాయి.
Advertisements
Advertisement
LEVEL 1:
స్టేట్ క్రికెట్ అసోసియేషన్ పంపిన అభ్యర్థులకు మరోసారి పరీక్ష నిర్వహించి మరో మెరిట్ లిస్ట్ ను తయారు చేసుకుంటుంది. వారినే తదుపరి లెవల్ కు సెలెక్ట్ చేసుకుంటుంది.!
LEVEL 2:
లెవల్ 1 లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు….. ఎక్స్ పీరియన్స్ ఉన్న అంపైర్స్ తో నాలుగు రోజులు పాటు ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత కొన్ని లోకల్ మ్యాచ్ లకు అంపైరింగ్ బాధ్యతలను అప్పగిస్తారు..ఆ సమయంలోనే అభ్యర్థుల శారీరక, మానసిక స్థితులను గమనిస్తారు.
LEVEL 3:
రాత పరీక్ష, ప్రాక్టికల్, వైవా ఈ మూడు పరీక్షలు పెట్టి అందులో టాపర్స్ ను తీసుకొని వారికి మెడికల్ టెస్ట్ లు చేసి….ఫైనల్ గా కొంత మందిని సెలెక్ట్ చేసి వారిని అంపైరింగ్ చేయడానికి అర్హులుగా ఆమోదిస్తూ BCCI ఓ సర్టిఫికేట్ ను జారీ చేస్తుంది.
సెలెక్ట్ అవ్వాలంటే ఏం ఉండాలి?
- మినిమం స్టేట్ లెవల్ క్రికెట్ ఆడిన అనుభవం ఉండాలి.
- ఫిజికల్ గా ఫిట్ ఉండాలి. ( గంటల తరబడి నిలబడి అంపైరింగ్ చేయాల్సి ఉంటుంది)
- మానసికంగా ధృఢంగా ఉండాలి ( పెద్ద పెద్ద మ్యాచ్ లు జరిగేటప్పుడు ఆటగాళ్ళు తమ అసహనాన్ని, అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు)
- మ్యాథమెటికల్ నాలెడ్జ్ ఉండాలి.