Advertisement
ఢిల్లినీ పాలిస్తున్న పృథ్వీరాజ్ చౌహన్ పై మహ్మద్ ఘోరి 17 సార్లు దండెత్తాడు. ఇందులో 16 సార్లు ఓడిపోయిన ఘోరి 17వ సారి విజయం సాధించాడు. ఓడిన ప్రతిసారీ చౌహాన్ ఘోరికి ప్రాణభిక్ష పెట్టాడు కానీ… ఘోరీ గెలిచాక చౌహాన్ ను ఖైదీగా చేసి తనతో పాటు కాబూల్ కు తీసుకెళ్ళాడు. దీనికి కారణం పృథ్వీరాజ్ మామ జైచంద్ అంటారు ( జైచంద్ కూతుర్ని ప్రేమించి స్వయంవరం నుండి పృథ్వీరాజ్ లేవదీసుకొచ్చాడనే కారణం)
ఖైదీగా ఉన్న పృథ్వీరాజ్ రెండు కళ్లను పీకేయించి అనేక కష్టాలకు గురిచేస్తుంటారు. ఈవిషయం తెల్సుకున్న పృథ్వీరాజ్ స్నేహితుడు, ఆస్థాన కవి అయిన చంద్ బర్దె కాబూల్ కు వెళ్లి.. ఘోరీతో పృథ్వీరాజ్ కు శబ్దభేరి విద్య వచ్చు…..అతి తక్కువ మందికి వచ్చిన ఆ విద్యను అతను చనిపోక ముందే చూడండని చెబుతాడట., ఆ విద్యను చూడాలన్న కుతూహలంతో వెంటనే ఘోరి ఆ ప్రదర్శనను ఏర్పాటు చేయాలని చెప్తాడు.
Advertisement
ఈ సమయంలో… .పృథ్వీరాజ్ దగ్గరకు చంద్ బర్దె వచ్చి ఓ కవిత్వం చెబుతాడు. ఆ కవిత్వంలోని అర్థాన్ని ఆధారంగా చేసుకొని పైన కూర్చున్న ఘోరి గుండెలోకి బాణాన్ని దించుతాడు.
చంద్ బర్దె చెప్పిన కవిత్వం ఇదే:
चार हाथ चौबीस गज अंगुल अष्ट प्रमान…!
ता ऊपर सुल्तान है, अब न चूक चौहान.. అనగా…. “నాలుగు బార్ల , 24 గజాల, 8 అంగులాల పైన సుల్తాన్ కూర్చున్నాడు. గురి తప్పొద్దు చౌహాన్”. బర్దె పద్యంలో చెప్పిన దూరాలను దృష్టిలో ఉంచుకొని కళ్లు కనిపించకపోయినా చౌహాన్ ఘోరి గుండెల్లోకి బాణాన్ని దించుతాడు. దీంతో ఘోరి అక్కడే ప్రాణాలు విడుస్తాడు. ఇది ప్రచారంలో ఉన్న పృథ్వీరాజ్ చౌహాన్ వీరగాథ.!
Watch Video:
Advertisements
Advertisements