Advertisement
మా హ్యూటాంగ్ చైనాలోని ఓ దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. 1993 లో B.Tech కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి పేజర్ కంపెనీలో జాబ్ సాధించాడు. నెలకి 176 డాలర్ల జీతం. శాలరీ తక్కువే అయినా….. చదివిన చదువుకి సంబంధించిన ఉద్యోగమని జాయిన్ అయ్యాడు. ఎప్పటికైనా వోల్వో కార్ కొనాలనేది అతని కల!
1996 లో ఇజ్రాయిల్ కంపెనీ ప్రపంచంలో మొట్టమొదటి “ఇన్ స్టాంట్ మెసెంజర్” (ICQ) కనిపెట్టింది. వాళ్ళ ప్రెజేంటేషన్ ని చూసిన మా హ్యూటాంగ్ దాన్ని కాపీ కొట్టి, అచ్చం దానిలాగే…. చైనీస్ వర్షన్ open ICQ కనిపెట్టి….. ముగ్గురు స్నేహితులతో కలిసి 1998 లో టెన్సెంట్ అనే కంపెనీని స్థాపించాడు! ఫోన్ లల్లో ఫ్రీ మెసేజెస్ అనేసరికి చైనా అంతా ఆ సాఫ్ట్ వేర్ ఒపెన్ సోర్స్ ఉపయోగించటం స్టార్ట్ చేసింది. కాపీ రైట్స్ సమస్య వచ్చి ఆ సాఫ్ట్ వేర్ కి కొన్ని మాడిఫికేషన్స్ చేసి “QQ” అని పేరు పెట్టాడు.
ఆ తర్వాత 2011 లో మా హ్యూటాంగ్ కంపనీ ‘టెన్సెంట్’ “We Chat” రూపొందించింది .అనతికాలంలోనే “We Chat” ను 100 కోట్ల యూజర్స్ డౌన్ లోడ్ చేసుకున్నారు. We Chat ద్వారా ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్స్ , బ్యాంకు వర్క్స్, గేమ్స్ , సినిమా టికెట్స్, డాక్టర్ అపాంయిట్మెంట్స్ …..ఇలా ప్రతీది చేసుకోవొచ్చు. కొరోనా కాలంలో సమాచారం షేర్ చేసుకోడానికి చైనా ఈ We Chat మీదే ఆధారపడింది!
ఫొర్బ్స్ ప్రపంచ టాప్ 10 ధనవంతుల లిస్ట్ లో కెక్కిన మొదటి చైనీయుడు మా హ్యూటంగ్ . అయినా ఇప్పటికీ తనకిష్టమైన వోల్వో కార్ నే డ్రైవ్ చేస్తాడు, ఇంకో కార్ లేదు. చాలా “లో-ప్రొఫైల్ లైఫ్”.! కాన్ఫరెన్సులు, అంతర్జాతీయ సమావేశాలప్పుడే బయటికి వస్తాడు, మిగతా సమయం అంతా అందరిలాగే ఉంటాడు.
Advertisements
Advertisement
చైనా లో ఐడియాల తో పెద్దగా ఉపయోగం లేదు, వాటిని ఎగ్జిగ్యూట్ చేయటమే ముఖ్యం అంటాడు “మా హ్యూటంగ్”. మా హ్యూటంగ్ ది స్టార్ట్ అప్ మెంటాలిటీ. వేరే వాళ్ళతో కాంపిటేషన్ ముఖ్యం కాదు, మనతో మనకి కాంపిటేషన్ ముఖ్యం అంటుంటాడు. ఆసియాలో అత్యంత వాల్యుబుల్ కంపెనీ టెన్సెంట్, దాని విలువ 255 బిలియన్ డాలర్లు ఇప్పుడు. ఫోర్బ్స్ మోస్ట్ అడ్మైరబుల్ కంపెనీ కూడా అదే. గేమింగ్ లో, ఇన్వెస్ట్మెంట్స్ లో ప్రపంచం లోనే నంబర్ వన్ మా హ్యూటంగ్ స్థాపించిన టెన్సెంట్. PUBG గేమ్ కూడా వాళ్ళదే.
కోవిడ్ కారణంగా ….అమెజాన్ కంపెనీ ఓనర్ జెఫ్ బెజోస్ సంపద 3.2 బిలియన్ డాలర్లు తగ్గింది, మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ సంపద 224 మిలియన్ డాలర్లు తగ్గింది, ఫేస్ బుక్ మార్క్ జుకర్ బర్గ్ సంపద 1.3 బిలియన్ డాలర్లు తగ్గింది, టెస్లా ఇలాన్ మస్క్ సంపద 2.7 బిలియన్ డాలర్లు తగ్గింది.. కానీ ఈ కోవిడ్ కాలం లో కూడా ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా 4.7 బిలియన్ డాలర్ల సంపద పెరిగింది మా హ్యూటంగ్ కే. ఈ జూలై లో ఫోర్బ్స్ విడుదల చేసిన ధనవంతుల జాబితా ప్రకారం చైనీస్ టైకూన్ ఆలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా ని వెనక్కి నెట్టి…. మా హ్యూటంగ్ చైనా లో అత్యంత ధనవంతుడు గా కొనసాగుతున్నాడు.! ఇప్పటికీ వోల్వో కార్ నే వాడతాడు, QQ ఛాటింగ్ లో పరిచయమైన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు.
ప్రపంచం లో అందరికీ భిన్నంగా తన కాంపిటేటర్స్ అయిన స్నాప్ ఛాట్, టెస్లా షేర్స్ ను కొంటాడు. వాళ్ళు ఎదగాలి, అభివృద్ది చెందాలి! అప్పుడు నాలో కసి పెరిగి నేను వాళ్ళకంటే ఎక్కువ అభివృద్ది సాధించగలను అంటాడు 48 యేండ్ల మా హ్యూటంగ్.
Advertisements
Article By : JAGAN