Advertisement
19 ఏళ్ల యువతి…. లెక్చరర్ తనను సెక్సువల్ గా వేధించాడని..ఆత్మహత్య చేసుకోడానికి .. బిల్డింగ్ పైకి ఎక్కింది. రెండు గంటలకు పైగా బతకడానికి గల కారణాలను అన్వేషించుకుంటూ కూర్చుంది. కానీ ఫలితం లేకుండా పోయింది చావడానికే నిర్ణయించుకొని .. తన ఫ్రెండ్స్ అందరికీ మెసేజ్ చేసి అక్కడి నుండి దూకేసింది.!
సీన్ -1 :
బిల్డింగ్ పై ఉన్న ఆ అమ్మాయిని చూసి.. వందల మంది జనాలు గుమ్మిగూడారు.. ‘1,2,3 దూకేయ్…దూకేయ్’ అంటూ గట్టిగా అరుస్తున్నారు. ;’ఎండ మండి పోతోంది .. త్వరగా దూకేసెయ్…. చూసేసి నేను ఇంటికెళ్లాలి. టైమ్ వేస్ట్ చేయకు’ అంటూ పెద్దగా నవ్వుతూ తమ తమ ఫోన్స్ లో వీడియో తీస్తున్నారు.
Advertisement
Advertisements
సీన్ -2 :
అమ్మాయి విషయం తెల్సుకున్న ఓ అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఆ ప్లేస్ కు వచ్చాడు. నిజానికి అతడికి వివాహం జరిగి ఇంకా ఆరు గంటలు కూడా కాలేదు.!తన భార్య తో సహా అక్కడి వచ్చి …ఆమెను కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. పైకి చేరుకొని ఆ అమ్మాయితో …. “పిచ్చి పనులు చేయకు- పైకి వచ్చేయ్” అన్నాడు. దానికి ఆ అమ్మాయి…”థ్యాంక్స్ అంకుల్ మీరు చాలా మంచి వారు, కానీ నేను వెళ్లాలి…వాళ్లంతా ఎదురు చూస్తున్నా”రంటూ దూకేసింది.! బలంగా నేలను తాకిన ఆమె మరణించింది.
Advertisements
ఆ ఫైర్ మెన్ కన్నీళ్లు పెట్టుకుంటూ కిందకు దిగాడు., వీడియో తమ ఫ్రెండ్స్ కు షేర్ చేసుకుంటూ జనాలు అక్కడి నుంది కదిలారు.!