Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

ఖండాలు దాటుకుంటూ వ‌చ్చి మ‌న‌కు మాత్ర‌మే దొరికే చేప‌- పుల‌స‌.! ఆ చేప ప్ర‌త్యేక‌త‌లు మీకోసం!

Advertisement

వ‌ర్షాకాలంలో మాత్ర‌మే దొరికే అరుదైన చేప- పుల‌స‌.! పుస్తెల‌మ్మి అయినా పులస తినాలి అనే సామెత‌ను బ‌ట్టి చెప్పొచ్చు ….ఆ చేప టేస్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో.! ఈ చేప కేవ‌లం గోదావ‌రిలో మ‌రియు హుగ్లీ న‌దిలో మాత్ర‌మే దొరుకుతుంది.! కానీ గోదావ‌రిలో దొరికే చేప టేస్ట్ చాలా బాగుంటుంది!

ఖండాలు దాటుతూ….గోదావ‌రికి చేరుతుంది!
ఈ చేప‌లు ఆస్ట్రేలియా న్యూజీలాండ్ నుండి హిందూ మహాస‌ముద్రం మీదుగా ప్ర‌యాణం చేసి బంగాళ‌ఖాతంలోకి ప్ర‌వేశిస్తాయి! గోదావ‌రి న‌ది అంత‌ర్వేది వద్ద బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది…ఈ క్ర‌మంలో అప్ప‌టికే బంగాళ‌ఖాతానికి చేరిన ఈ చేప‌లు గోదావ‌రి న‌ది ప్ర‌వాహానికి వ్య‌తిరేఖంగా వేగంగా ఈదుకుంటూ వెళ్తాయి.! స‌ముద్ర‌పు ఉప్పునీటి కంటే గోదావరి తీపి నీటిలో గుడ్లు పెట్టాల‌నే కార‌ణంతో…..!

స‌ముద్రంలోనే విల‌స‌లే…. గోదావ‌రి న‌ది నీటిలోకి వ‌చ్చాక పుల‌స‌లుగా మారుతాయి!
వాస్త‌వానికి స‌ముద్రంలో ఉన్న‌ప్పుడు వీటిని విల‌స‌లు అంటారు…ఉప్ప‌నీటిలో ఉండ‌డం కార‌ణంగా అప్పుడు అంత టేస్ట్ ఉండ‌వు…గోదావ‌రి నీటిలోకి చేర‌గానే ఈ చేప‌కు అద్భుత‌మైన టేస్ట్ వ‌స్తుంది!

ఆడ‌పుల‌స‌ల‌కు డిమాండ్ ఎక్కువ‌!
పుల‌స చేప‌ల్లో ఆడ చేప‌కు అది కూడా గ‌ర్భంతో ఉన్న ఆడ‌చేప‌కు డిమాండ్ ఎక్కువ‌గా ఉంటుంది! ఇత‌ర చేప‌ల‌తో పోలిస్తే ముల్లులు ఎక్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ ….దీని రుచి రీత్యా దీనికి డిమాండ్ ఎక్కువ‌గా ఉంటుంది. అది కూడా ఈ చేప‌లు ఆగ‌స్ట్ నుండి సెప్టెంబ‌ర్ మ‌ధ్య‌లోనే దొరుకుతాయి కాబ‌ట్టి మ‌రింత డిమాండ్ ఉంటుంది!

Advertisements

Advertisement

రేటు ఎలా ఉంటుంది?
సముద్రానికి దగ్గరగా ఉండే యానాం, కోటిపల్లి ప్రాంతాల్లో దొరికే పులసలకు తక్కువధర ఉంటుంది. ధవళేశ్వరం సమీపంలో దొరికే చేపల‌కు విప‌రీత‌మైన ధ‌ర ఉంటుంది! కేజీ 2000 నుంచి రూ.7 వేల వరకూ ఉంటుంది!

Image Credits: Our Godavari

పుల‌స ఇత‌ర విశేషాలు.

  • వ‌ల‌లో ప‌డగానే చ‌నిపోతాయి!
  • సంక్రాంతికి బంధువులు వ‌చ్చిన‌ట్టే…..పుస‌ల‌ను తిన‌డానికి కూడా ప్ర‌త్యేకంగా బంధువులు వ‌స్తుంటారు!
  • మ‌త్స్య‌కారులు క‌డుపునిండా తిండి తినేది ఈ సీజ‌న్ లోనే….పుల‌స పేరుతో కొద్దోగొప్పో కూడ‌బెట్టుకుంటారు!
  • పుల‌స‌కు ఉన్న డిమాండ్ కార‌ణంగా న‌కిలీ పుల‌స‌ల‌ను మార్కెట్ లో అమ్ముతున్నారు…పుల‌స‌లుగా మార‌క‌ముందే స‌ముద్రంలో దొరికే విల‌స‌ల‌నే
  • పుల‌స‌లుగా అమ్ముతుంటారు. విల‌స‌లు – న‌లుపు, ఎరుపు రంగులో ఉంటాయి. పుల‌స‌లు వెండి క‌ల‌ర్ లో ఉంటాయి!

Advertisements

పుల‌స‌లు అంత‌రించి పోయే ప్ర‌మాదం!
పుల‌స‌ల‌కు ఉన్న డిమాండ్ దానికి తోడు గ‌ర్భంతో ఉన్న పుల‌స‌ల‌ను తిన‌డానికి ఎక్కువ
ఇంట్ర‌స్ట్ చూప‌డంతో వీటి ప్ర‌త్యుత్ప‌త్తి మీద తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంది..ఇలాగే కొన‌సాగితే అరుదైన పుల‌స అంత‌రించి పోయే ప్ర‌మాద‌ముంది!